చంద్రబాబు సంచలనం...? రాజు గారికి గవర్నర్ పదవి ఇస్తున్నారా?

విజయనగరంలోని పూసపాటి సంస్థానం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు ఇపుడు రాజ్ భవన్ లోకి నేరుగా అడుగు పెట్టనున్నారు అని అంటున్నారు. ఆయన ఠీవీకి ఆయన దర్జాకు ఆయన హోదాకు ఇది సరైన పోస్టు అని అంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభకు మూడు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటి భర్తీ కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆ పదవుల విషయంలో అశోక్ గజపతిరాజు పేరు కూడా గట్టిగా వినిపిస్తొంది. అయితే అశోక్ ని గవర్నర్ గా పంపించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.


సీనియర్ మోస్ట్ నేతగా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఒక్నాడు తనకు అత్యంత సహచరుడిగా గుర్తింపు పొందిన అశోక్ కి గవర్నర్ పదవి ఇవ్వడమే ఉత్తమమని చంద్రబాబు భావిస్తున్నారు అని అంటున్నారు. అనేక రాష్ట్రాలలో గవర్నర్ పదవులు ఖాళీ అవుతున్నాయి. తమకు అత్యంత మిత్రుడు కేంద్రంలో మూడో మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారణం అయిన చంద్రబాబు టీడీపీకి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది అని అంటున్నారు.


దాంతో ఆ ఒక్క గవర్నర్ పోస్టుకు బాబు నుంచి ప్రతిపాదనలు వెళ్లాల్సి ఉంది. అయితే టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు ఆ పదవి కోసం ఉన్నారని అంటున్నారు. అందులో ఒకరు అశోక్ గజపతిరాజు అయితే మరొకరు యనమల రామకృష్ణుడు అని అంటున్నారు. ఈ ఇద్దరూ టీడీపీ పుట్టిన నాటి నుంచి ఉంటూ వచ్చిన వారు. ఏళ్ల తరబడి టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా కొనసాగుతున్నారు


చంద్రబాబు అంటే వారికి అమితమైన అభిమానం. పార్టీ పట్ల విధేయులుగా ఉంటారు. ఇద్దరూ రాజ్యాంగ నిపుణులే. గవర్నర్ గా రాణించేవారే. అయితే ఈ ఇద్దరిలో ఎవరి పేరుని ప్రతిపాధించాలి అన్నదే ఇపుడు టీడీపీకి పట్టుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో కీలకమైన పౌర విమాన యాన శాఖ మంత్రిగా నాలుగేళ్ల పాటు పనిచేసిన్ అశోక్ గజపతిరాజు అంటే మోడీకి ప్రత్యేకమైన అభిమానం ఉంది.


అందువల్ల ఆయనకు గవర్నర్ పోస్టుకి టీడీపీతో పాటు బీజేపీ పెద్దలు కూడా మద్దతు ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా అన్ని లెక్కలూ చూసుకుంటే అశోక్ కే గవర్నర్ పదవి దక్కడం ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: