రేషన్ బియ్యం ఎగ్గోటేందుకు సిద్ధమైన కూటమి సర్కార్? పెద్ద ప్లానే వేసిన పవన్ కల్యాణ్..?

రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.  నిరుపేదలకు ఆదుకోవాలని లక్ష్యంతో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఒక్కో కిలో బియ్యంపై 40 రూపాయల వరకు భారం పడుతుంది.  ప్రభుత్వమే ఈ రాయితీని భరిస్తోంది.



అయితే ఈ రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్క దారి పడుతుంది.  ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున బియ్యం తరలిపోతున్న విషయం బయటపడింది.  గతం నుంచి ఆరోపణలు ఉన్నా.. సాక్షాత్ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కలుగజేసుకొని ఆ బియ్యాన్ని పట్టుకున్నారు.  దీంతో ఇది సంచలనంగా మారింది. అందుకే పేదలకు బియ్యం బదులు నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.


పేదలు మూడు పూటలా అన్నం తినేందుకుగాను తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారిగా రేషన్ పంపిణీ మరింత సరళతరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేసింది. నాడు టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఈ విషయంలో చొరవ చూపారు.   అయితే ఇలా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ లబ్ధిదారుడి కంటే వ్యాపారులకు, దళారులకు లబ్ధి చేకూర్చుతోంది.



బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర 50 రూపాయల పై మాటే. అయితే చౌక ధరల డిపో ద్వారా అందిస్తున్న బియ్యం కిలో రెండు రూపాయలు మాత్రమే. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తోంది.  అయితే ఈ బియ్యాన్ని గ్రామాల్లో దళారులు, వ్యాపారులు 17 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొంత బియ్యం మిల్లులో మరోసారి మర పట్టి క్వాలిటీ బియ్యం లో కలిపేస్తున్నారు.  



అయితే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు వస్తోంది. అక్కడ నుంచి నౌకల్లో విదేశాలకు తరలిపోతోంది. ఈ తరుణంలోనే రేషన్ బియ్యం పక్కదారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే రేషన్ పంపిణీలో బియ్యం బదులు నగదు అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: