ఏపీలో ఇలానే కొనసాగితే జగన్ కి అధికారం దక్కడం కష్టమేనా?

కలసి ఉంటే కలదు సుఖం అని కూటమిలోని మూడు ప్రధాన పార్టీలూ ఆలోచన చేస్తున్నాయి.  నరేంద్ర మోడీ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పొలిటికల్ గా చూస్తే ఏపీలో డెడ్లీ కాంబో గానే అంతా చూస్తున్నారు.  కూటమిలో మోడీ, చంద్రబాబు, పవన్ కాంబోని ఓడించడం కష్టమన్నది జగన్ కి రెండు సార్లు అర్థం అయింది.  2014, 2024 ఎన్నికల్లో అదే జరిగింది. 2019లో ముగ్గురూ విడిగా పోటీ చేయడం వల్ల విజయం దక్కిందని అంటున్నారు.


ఆనాడు మోడీకి చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెంచడంలో వైసీపీ సక్సెస్ అయింది. కానీ ఇపుడు అంతా సర్దుకున్నారు. కలసి ఉంటేనే భారీ లాభమని కూడా గ్రహించారు.  పవన్ కళ్యాణ్ సైతం టీడీపీతోనే ఉంటూ బలం పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికిపుడు సీఎం అయిపోవాలన్న ఆశలు అయితే ఆయన పెట్టుకోవడం లేదని అంటున్నారు.  ఏపీలో మరో టెర్మ్ కూడా అధికారం కోసం బీజేపీ చూడడం లేదు. బీజేపీ ఆలోచనలు అన్నీ తెలంగాణా మీదనే ఉన్నాయని అంటున్నారు.



ఓటర్లు వైసీపీ వైపు టర్న్ తీసుకోవాలీ అంటే టీడీపీ కూటమి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావాల్సిందే అని అంటున్నారు. మరి అది అలా ఇలా కాదు ఏకంగా సునామీ రేంజిలో రావాలి. అటువంటి పరిస్థితి ఉంటేనే తప్ప జగన్ కి చాన్స్ రాదని కూడా అంటున్నారు. మరి అంత తేలికగా కూటమి జగన్ కి చాన్స్ ఇస్తుందా అన్నది చూడాలి.


అంటే అన్నేసి తప్పులు చేసే విధంగా పాలన చేస్తుందా అన్నదే చర్చ.  చంద్రబాబు వైఖరి చూస్తే ఆయన గతంలో మూడు సార్లు చేసిన నాటికీ ఇప్పటికీ బాగానే మారిపోయారు. ఆయనలో చాలా వరకూ రాజీతత్వం కనిపిస్తోంది. ఆయన టీడీపీ ఫ్యూచర్ ని చూస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి బాబు గతంలో చేసిన తప్పులు చేయరనే అంటున్నారు.



ఇక పవన్ అయితే వైసీపీని మళ్లీ ఓడించడం ద్వారా ఏపీలో ఆ పార్టీని పునాదులలో లేకుండా చూడాలని కసి మీద ఉన్నారు. మోడీకి అయితే కూటమి గెలవాలన్నదే టార్గెట్ అని అంటున్నారు. సో అలా అందరూ కలసి పట్టుదలగా ఉంటే మాత్రం వైసీపీకి సీట్లూ ఓట్లూ పెరగవచ్చేమో కానీ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందా అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: