లక్షతో పాటు తులం బంగారం..! ఎప్పటి నుంచి అమలు అంటే..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దకాలం నిరీక్షణ తరువాత అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ కొలువుదీరి ఏడాది సమయం కూడా గడిచింది. ఏడాది ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నది.అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని అమల్లోకి తెస్తున్నారు.


కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. ముందుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. దాంతో ఇచ్చిన హామీల్లో మొదటి గ్యారంటీని అమలు చేసి చూపించారు. ఆ తర్వాత రైతుల హామీలను నెరవేర్చే పనిలో పాలకులు బిజీ అయిపోయారు. ఇటీవల 2 లక్షల రుణమాఫీని సైతం చేశారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు.


ఇక.. కాంగ్రెస్ హామీల్లో మరో కీలక హామీ అయిన తులం బంగారం, ఒక్కొక్కరికి రూ.2,500, చదువుకునే యువతలకు స్కూటీలు వంటివి అమల్లోకి రాలేదు. దీంతో దీనిపై చాలా వరకు విమర్శలు వచ్చాయి. అందులోనూ ప్రధానంగా కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చారు. తులం బంగారం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆడబిడ్డలు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే.. దీనిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తాజాగా క్లారిటీ ఇచ్చారు.


ప్రజా విజయోత్సవాల్లో భాగంగా.. మంత్రి శ్రీధర్ బాబు ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తులం బంగారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నదన్నారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం లాంటి హామీల అమలు ఇంకాస్త సమయం పడుతుందని చెప్పారు. ఒక్కో హామీ అమలు దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. పెండింగ్ హామీల అమలుపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని ఎన్నో పనులను తాము ఏడాదిలోనే చేసి చూపించామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: