అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించి బెయిల్ ఇప్పించిన వైసీపీ ఎంపీ..? జగన్ ఆదేశాలతోనేనా?

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.  అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు పడిందని, ఆయన పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తాడని, ఇలా సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు అభిమానులను భయబ్రాంతులకు గురి చేసింది.  


ఆయన అల్లు అర్జున్‌ తరుపున వాదించిన లాయర్ మామూలు వ్యక్తి కాదు. గంట పాటు కోర్టు కూర్చొని వాదిస్తే, నాలుగు లక్షల రూపాయిలు ఇస్తారు. రోజంతా కోర్టులోనే కూర్చుంటే 96 లక్షల రూపాయిలు. ఈ స్థాయి ప్రొఫైల్ ఉన్న లాయర్ని దింపారు అల్లు అరవింద్.


ఈ నిరంజన్ రెడ్డి మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ చిత్రానికి నిర్మాత. మెగా ఫ్యామిలీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.  దీంతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు కూడా.  జగన్ కేసులన్నీ ఆయనే దగ్గరుండి చూస్తున్నారు.  పైగా ఇప్పుడు అల్లు అర్జున్ కి వైసీపీ సపోర్టు ఫుల్ గా లభించింది. ఏకంగా అల్లు అర్జున్ అరెస్టును జగన్ ఖండించారు. 



మెగాస్టార్ చిరంజీవి నేడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే ఆయన ఇంటికి చేరుకొని, నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి బెయిల్ ని మంజూరు అయ్యే మార్గాలను అడిగి తెలుసుకున్నాడు. నిరంజన్ రెడ్డి వెంటనే హైదరాబాద్ కి చేరుకొని అల్లు అర్జున్ కేసు ని టేకప్ చేసాడు.  ఆయన వాదించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది.


క్వాష్ పిటీషన్ ని విచారించి, అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ ని విధించిన తర్వాత, అతన్ని మరికాసేపట్లో జైలుకు తరలించబోతున్నారు అనే పరిస్థితి ఉన్నప్పుడు, బెయిల్ మంజూరు చెయ్యించాడంటే, ఇతని ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  ప్రభుత్వం వైపు ఉన్నటువంటి లూప్ హోల్స్ ని బయటకి తీసి, వాళ్ళను డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయేలా చేశారు.  జగన్ మీద ఎలాంటి కేసులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. జగన్‌ ఇన్ని రోజులు బెయిల్ మీద బయట ఉండడానికి కారణం కూడా నిరంజన్ రెడ్డే అనే వాదన ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: