పోతూ పోతూ అమెరికాను ఆగం చేస్తున్న జో బైడెన్..! తల పట్టుకుంటున్న ట్రంప్?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.2025, జనవరి 20న నూతన అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు. 47వ అధ్యక్షుడిగా వైట్‌హైస్‌లో అడుగు పెట్టనున్నారు.
ఇక ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పదవీకాలం మరో 40 రోజుల్లో ముగియనుంది. ఈ తరుణంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవలే తన కొడుకుకు ఓ కేసులో క్షమాభిక్ష పెట్టిన బైడెన్.. ఇప్పుడు… మరో 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేకాదు. 1,500 మంది ఖైదీల శిక్షాకాలం తగ్గించారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా శిక్షాకాలం తగ్గించారు. క్షమాభిక్ష పొందినవారిలో స్వలింగ సంపర్కులు, మాదక ద్రవ్యాల వినియోగం చేసేవాళ్లు ఉ న్నారు. హింసాత్మకం కాని నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష ప్రసాదించారు.
జోబైడెన్ ఒకేరోజు 1,500 మంది శిక్ష తగ్గించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ ఇంత మందికి ఒకే రోజు శిక్ష తగ్గించలేదు. ఇప్పుడు బైడెన్ ఆ పనిచేశారు. కోవిడ్ సంక్షో సమయంలో కారాగారాల్లో కరోనా విజృంభించి ఎక్కువ మంది ఖైదీలు వైరస్‌తో మృతిచెందారు. దీంతో నాడు చాలా మందిని బైడెన్ ప్రభుత్వం చాలా మంది ఖైదీలను విడుదల చేసింది. తాజాగా వీరికే శిక్ష తగ్గించారు.
ఇటీవలే బైడెన్ కొడుకుకు క్షమాభిక్ష పెట్టారు. అక్రమ ఆయుధాలు, తప్పుడు సమాచారం కేసులో అతనికి కోర్టు శిక్ష విధించింది. ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈతరుణంలో బైడెన్ పదవీ విరమణకు రెండు నెలల మందు క్షమాభిక్ష ప్రసాదించారు. తాజాగా 39 మందికి కొత్తగా క్షబాభిక్ష పెట్టారు. 1,500 మంది శిక్ష తగ్గించి రికార్డు సృష్టించారు. కాగా గతంలో బరాక్ ఒబామా పదవీ కాలం ముగిసే సమయంలో ఒకేరోజు 330 మంది ఖైదీలకు శిక్ష తగ్గించగా… ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అయితే బైడెన్ ఈ రికార్డును తిరగరాశారని అంటున్నారు.