రేవంత్ కి షాక్ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ మామ?

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం లో కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ ను సినీ ప్రముఖులతో పాటుగా కొన్ని రాజకీయ పార్టీలు తప్పు బట్టాయి.అయితే, చట్టం ముందు అందరూ ఒకటేనని..ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటం.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రభుత్వంలోని ముఖ్యులు గుర్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నారనే ప్రచారం తెర పైకి వచ్చింది.


అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. తొలుత బీఆర్ఎస్ లో ఉన్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇబ్రహీం పట్నం అసెంబ్లీ టికెట్ ఖరారు చేసింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తరువాత గులాబీ పార్టీలోనే కొనసాగారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ టికెట్ ఆశించారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి నాగార్జునసాగర్‌ టికెట్ ఖాయం అని భావించారు. తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని కూడా ప్రకటించారు. అప్పటికే శేఖర్ రెడ్డి నిర్వహిస్తున్న పలు కార్య క్రమాల్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. కానీ, బీఆర్ఎస్ నుంచి సీటు దక్కలేదు. దీంతో, బీఆర్ఎస్ ఓటమి తరువాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తో ఆయన పార్టీ వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


తన అల్లుడు తప్పు లేకపోయినా అరెస్ట్ చేసారంటూ శేఖర్ రెడ్డి తన సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగితే అవమానం అనే అభిప్రాయం తో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన తరువాత పార్టీకి రాజీనామా పైన తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా మంత్రి సీతక్క సైతం చిరంజీవితో పాటుగా శేఖర్ రెడ్డి తమ పార్టీలోనే ఉన్నారని...అల్లు అర్జున్ పైన ఎలాంటి కక్ష్య లేదని స్పష్టం చేసారు. అయితే .. అల్లు అర్జున్ అరెస్ట్ తో శేఖర్ రెడ్డి మాత్రం ఆవేదనతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో శేఖర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: