కేసీఆర్ తొలిసారి దేశం దాటేస్తున్నారా? రీసన్ ఏంటి?

frame కేసీఆర్ తొలిసారి దేశం దాటేస్తున్నారా? రీసన్ ఏంటి?

మాజీ సీఎం కేసీఆర్ కి ఒక బ్రాండ్ ఉంది. ఆయన ఉద్యమకారుడుగా ఉంటూ అధికారం అందుకున్న అరుదైన నేత.  ఉద్యమం వేరు రాజకీయం వేరు. ఉద్యమం ఎపుడూ అగ్గిలా రాజుకుంటూనే ఉంటుంది. అయినా కేసీఆర్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగారు.  


ఏడాది కాలంలో పార్లమెంట్ ఎన్నికలపుడు కొద్ది సమయం తప్ప మిగిలిన కాలం అంతా జనానికి దూరంగా తన ఫాం హౌస్ లోనే గడిపారు.  ఆయన తొందరలో జనంలోకి వచ్చి తెలంగాణా అంతా పెద్ద ఎత్తున పర్యటిస్తారు అన్న వార్తలు వినిపించాయి.  అయితే వాటిని తలదన్నేలా మరో వార్త ఇపుడు ముందుకు వచ్చింది అదేంటి అంటే కేసీఆర్ ఏకంగా కొన్నాళ్ల పాటు తెలంగాణాకే కాదు దేశానికి దూరంగా ఉండబోతున్నారు అన్నదే ఆ వార్త.


కేసేఅర్ తొందర్లోనే అమెరికా వెళ్లబోతున్నారు అని తెలుస్తోంది.  దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు తమ తొలి విదేశీ పర్యటననే అమెరికాగా చేసుకుంటారు. అలాంటిది కేసీఆర్ మాత్రం రెండు సార్లు సీఎం గా ఉన్న కొన్నాళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్నా దాని కంటే ముందు రాష్ట్ర మంత్రిగా పనిచేసినా కూడా ఎన్నడూ అమెరికాకు పోలేదని అంటున్నారు


కేటీఆర్, కవిత అమెరికాలోనే చదువుకున్నారు. అయినా సరే కేసీఆర్ అపుడు కూడా అమెరికా వెళ్లలేదని అంటున్నారు. అయితే ఇపుడు ఆయన అమెరికా వెళ్లడానికి ఒక బలమైన రక్త సంబంధమే కారణమని అంటున్నారు.  తన మనవడు హిమాన్షు కోరిక మేరకే ఆయన అమెరికా యాత్ర చేస్తున్నారు అని అంటున్నారు. ఇటీవల తెలంగాణాకు వచ్చిన హిమాన్షు తాతను అమెరికాకు రావాలని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలని కోరారట.


మనవడి కోరికను కాదనలేకనే కేసీఆర్ అమెరికా టూర్ పెట్టుకున్నారు అని అంటున్నారు.  అక్కడ ఆయన దాదాపుగా రెండు నెలల పాటు ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన అమెరికాలోని ఎన్నారైలతో మీటింగులు పెట్టి బీఆర్ఎస్ పటిష్టత కోసం వారి సహకారం తీసుకునే విధంగా కూడా వ్యూహాలు రూపొందిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే కేసీఆర్ జనంలోకి జనవరిలో వచ్చే కార్యక్రమం కొన్నాళ్ళ పాటు వాయిదా పడవచ్చు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: