హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్..! ఇదిగో సాక్ష్యం..?

ఒకప్పుడు జోరుగా సాగిన దేశీయ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మళ్లీ కుప్పకూలుతోంది. ఇళ్ల అమ్మకాలపై ప్రాప్ ఈక్విటీ విడుదల చేసిన తాజా గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.  అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 21 శాతం తగ్గాయని చెబుతున్నారు.  


ఢిల్లీ NCR, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, పూణే, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో 1.08 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 1,37,225 యూనిట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఢిల్లీ NCRలో మాత్రమే అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. ఇళ్ల అమ్మకాలు పడిపోయిన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.


హైదరాబాద్‌ లో కేవలం 12,682 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 24,044 యూనిట్ల నుండి 47 శాతం తగ్గుదలగా చెప్పొచ్చు.  సిలికాన్ సిటీ బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. చెన్నైలో 9 శాతం తగ్గాయి. బేస్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇళ్ల అమ్మకాలు తగ్గాయని ప్రాప్ ఈక్విటీ సీఈఓ, వ్యవస్థాపకుడు సమీర్ జసుజా అన్నారు.  


నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పోలిస్తే రెడీమేడ్ ఇళ్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.  ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో బిల్డర్లు తక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇల్లు కొనాలనే తమ కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు 47శాతం తగ్గొచ్చని అంచనా వేసింది.  2023-24 డిసెంబర్‌ త్రైమాసికంలో 24,044 ఇళ్ల అమ్మకాలు జరిగితే ప్రస్తుత ఏడాది 12,682 యూనిట్లకు పరిమితం కావొచ్చు. బెంగళూరులో 14,957, చెన్నైలో 4,266 యూనిట్లకు చేరుకోవచ్చు.  కోల్‌కతాలో అమ్మకాలు 33శాతం తగ్గి 5,653 నుంచి 3,763 యూనిట్లకు తగ్గిపోవచ్చు.  ముంబైలో గృహ విక్రయాలు 13,878 యూనిట్ల నుంచి 27శాతం పతనమై 10,077 యూనిట్లుగా ఉండొచ్చు. నవీ ముంబై పరిధిలో 13శాతం విక్రయాలు తగ్గే ఛాన్స్ ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: