అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు.. రేవంత్‌ చుక్కలు చూపిస్తారా?

అల్లు అర్జున్‌ వర్సెస్‌ రేవంత్ రెడ్డి వివాదం కొనసాగుతూనే ఉంది. సరికదా రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఇవాళ  ఉదయం 11గం విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ ఏ11గా ఉన్న సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్ విధించగా.. అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

ప్రస్తుతం అల్లు అర్జున్  మధ్యంతర బెయిల్‌పైనే ఉన్నారు. అయితే.. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి ఆయనపై అసెంబ్లీలో మాట్లాడటం.. దానికి అల్లు అర్జున్‌ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇష్యూ మరింత ముదిరింది. ఆ తర్వాత ఆయన ఇంటిపై దాడి జరగడం.. ప్రభుత్వం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అల్లు అర్జున్‌పై నేరుగా విమర్శలు చేస్తుండటంతో వ్యవహారం మరింత పాకాన పడింది. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్‌ను విచారణకు పిలవడంతో మళ్లీ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నోటీసులపై తన లాయర్లతో అల్లు అర్జున్ చర్చించినట్టు తెలిసింది. మొత్తానికి ఈ ఇష్యూ మరింత ఈగో క్లాష్ గా మారింది. ప్రభుత్వం తన వైపు గేమ్ ఉండే వరకు ఆపే సూచనలు కనిపించడం లేదు. ఏదైనా జరగాలి లేదా అల్లు అర్జున్ పూర్తిగా స్లో అయిపోవాలి.. గెలకకుండా వేరే ఇష్యూ వచ్చేదాకా మౌనంగా ఉంటే బెటర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఇదంతా కేటీఆర్‌ అండ్‌ టీమ్‌ అల్లు అరవింద్‌తో ఆడిస్తున్న హై డ్రామా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. పువ్వు కోసం పువ్వు పార్టీ డ్రామా.. మధ్యలో..  సైకిల్ సర్కస్ అంటూ నెటిజన్లు కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ ఇష్యూలో అల్లు అర్జున్‌ చిన్న విషయానికి ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ఘటన జరిగిన వెంటనే మానవత్వంతో స్పందిస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: