షర్మిలకు చెక్ పెట్టేలా జగన్ సరికొత్త వ్యూహం..! ప్లాన్ మామూలుగా లేదు గా?

షర్మిలను జగన్ టార్గెట్ చేశారా? ఆమెను పదవి నుంచి దించడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారా? కాంగ్రెస్ హై కమాండ్ ముందు అవే షరతులు పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కీలక భాగస్వామి.  బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమిలో చేరాలని భావిస్తున్నారు.  అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కనిపిస్తోంది.



కానీ కాంగ్రెస్ పార్టీతో గత అనుభవాల దృష్ట్యా జగన్ ఆసక్తి కనబరచడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు మాత్రం జగన్ ను పార్టీ హై కమాండ్ తో కలపాలని చూస్తున్నారు. బెంగళూరు నుంచి ఇదే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం ఉంది.



ఇండియా కూటమి వైపు అడుగులు వేయాలంటే.. ఏపీలో వైసీపీ ఇచ్చిన సీట్లను కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు తీసుకోవాలి.  పవర్ షేరింగ్ ఉండకూడదు.  గతం మాదిరిగా వైసీపీ పూర్తిగా స్వేచ్ఛగా  పాలన చేయాలి. ప్రజా రంజక పాలన అందించాలి. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలి. అందుకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీతో చెలిమికి తాను ఒప్పుకుంటానని జగన్ ముక్కు సూటిగా చెప్పినట్లు సమాచారం.  గతం మాదిరిగా ఢిల్లీ పెత్తనాన్ని సహించేది లేదని ముందుగానే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.  రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేక హోదాకు కూడా సమ్మతిస్తేనే కలిసేందుకు ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం.


ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం మార్చాలన్నది మరో ప్రధానమైన డిమాండ్.  షర్మిలతో జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ డ్యామేజ్ జరగడానికి ఆమె కారణమన్నది ఒక విశ్లేషణ.  వైసిపి ఓడిపోయినా షర్మిల అదే పనిగా తనను టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ పెద్దల వద్ద జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.  ఆమెను తప్పిస్తేనే తాను కాంగ్రెస్ తో కలుస్తానని షరతు పెట్టినట్లు సమాచారం. అయితే ఇవన్నీ బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న చర్చలేనని ఒక రకమైన ప్రచారం అయితే నడుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు బిజెపి విషయంలో వ్యతిరేకంగా వెళ్లి.. లేనిపోని కష్టాలు తీర్చుకోకూడదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: