మోదీ మూడు టెర్ముల్లో చేయలేనిది... మన్మోహన్ సింగ్ చేసింది ఇదే...?
మన్మోహన్ సింగ్ ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఉండకపోవచ్చు.. ఆయన ఒక్కసారీ పార్టీ అధ్యక్షుడు కాకపోయి ఉండొచ్చు.. తనకు వాగ్ధాటి లేకపోవచ్చు..ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడలేకపోవచ్చు.. తన అంతరంగం అంతుబట్టకపోవచ్చు.. నరేంద్ర మోదీ ప్రత్యక్ష ఎన్నికల్లో (లోక్ సభ, శాసనసభ) ఒక్కసారీ ఓడిపోయి ఉండకపోవచ్చు.. ముఖ్యమంత్రిగా 12 ఏళ్లు.. పదేళ్లు ప్రధానిగా పనిచేసి ఉండొచ్చు.. ప్రజలను కట్టిపడేసేలా ప్రసంగాలు చేయడంలో దిట్టకావొచ్చు.. విపరీతమైన అభిమానులు ఉండొచ్చు..
కానీ ఒక్క విషయంలో మాత్రం మన్మోహన్ సింగ్ ను నరేంద్ర మోదీ ఎప్పటికీ బీట్ చేయలేరు. ఎందుకంటే.. మోదీకి అది అసాధ్యమైనది కావడమే.. 2004లో అనూహ్యంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్. చాలా ముందుగానే ఊహించినట్లుగానే 2014లో ప్రధాని అయ్యారు మోదీ. ఈ విధంగా చూసుకుంటూ మీడియాకు ఎక్కువగా అందుబాటులో ఉండాల్సినది ఎవరు?
పై ప్రశ్న సాధారణ ప్రజల్లో ఎవరిని అడిగినా.. ఇట్టే జవాబు చెప్పే పేరు నరేంద్ర మోదీ. కానీ, మోదీ గత పదిన్నర సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. మరి సోనియాగాంధీ చాటు వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొన్న మన్మోహన్ 117సార్లు మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో 117 సార్లు అంటే ఏడాదికి 17 సార్లు. నెలకు దాదాపు ఒక్కసారైనా మీడియాతో ముచ్చటించారు.
మోదీ తన మాటలతో ఎంత బలంగా ముద్ర వేస్తారో అందరికీ తెలిసిందే. కానీ, మన్మోహన్ మాత్రం మౌన మునిగా పేరు తెచ్చుకున్నారు. కానీ మీడియా ముందు మోదీ మౌన ముని. మన్మోహన్ మాత్రం మీడియా ఫ్రెండ్.
ప్రధాని తరచూ మీడియా సమావేశాల్లో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం పట్ల ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. ఈ విధంగానే పారదర్శకత, జవాబుదారీతనం అనేవి మన్మోహన్ సింగ్ ప్రధాన బలంగా మారాయి. మీడియాతో మాట్లాడే సందర్భంలోనూ చాలా ప్రశ్నలకు మన్మోహన్ సూటిగా జవాబులు చెప్పేవారు. గతంలో ఏ ప్రధానిలోనూ లేని లక్షణంగా పేర్కొంటారు.
కాగా, మోదీ పదేళ్లలో 2019లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కానీ, ఇందులో అమిత్ షా మాట్లాడారు. మన్మోహన్ 117 మీడియా సమావేశాల్లో 72 మంది విదేశీ పర్యటనలు, 10 మంది వార్షిక ప్రెస్ లు, 23 మంది దేశీయ లేదా రాష్ట్ర పర్యటనలు, 12 ఎన్నికలకు సంబంధించినవి.