ఆ విషయంలో జగన్‌ను బండబూతులు తిట్టి.. ఇప్పుడుబాబు చేస్తున్నదేంటి?
రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా కేవలం ఆరు నెలల కాలంలోనే చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.1,12,750 కోట్ల అప్పులు చేసిందట. ఇది అప్పుల్లోనే ఒక సరికొత్త రికార్డ్ అంటున్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. చురకలంటించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 3 నెలలున్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు.
అలవి కాని హమీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశామని చందగ్రబాబు ప్రచారం చేశారు. అయితే ఆరు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు, రుణాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే రాష్ట్రం రుణ ఊబిలో కూరుకుపోతోందని అర్థమవుతోందంటున్నారు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెలా అప్పులు చేస్తున్నారని... అధికారం చేపట్టిన రెండు వారాల్లోనే జూన్ 24న రూ.6 వేల కోట్లు, జూలై 24న రూ.10 వేల కోట్లు, ఆగస్టులో రూ.3 వేల కోట్లు, సెప్టెంబరులో రూ.4 వేల కోట్లు అప్పులు చేశారని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి లెక్కలు చెప్పారు. అలాగే అక్టోబరులో రూ.6 వేల కోట్లు, నవంబరులో రూ.4 వేల కోట్లు, డిసెంబరులో రూ.9,237 కోట్ల అప్ప చేశారని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు. మరి ఇలా బుగ్గన లెక్కలతో సహా చెప్పేశాక మరి టీడీపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.