పవన్ కల్యాణా లేక పని రాక్షసుడా..? ఉరుకులు పెట్టిస్తున్నారు గా?

తెలుగు రాజకీయాల్లో కొత్త శకానికి తెర తీయాలన్న తలంపుతో జనసేన పేరుతో పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్ని కావు.  అనుమానాలు.. సందేహాలు.. సూటిపోటి మాటలు.. ఎంత కపడినా ఫలితం దక్కని తీరుతో నిరాశకు గురైనా వెనక్కి తగ్గకపోవటం పవన్ కు మాత్రమే సాధ్యమవుతుంది.  


వంద శాతం స్ట్రైక్ రేటుతో తెలుగు రాజకీయాల్లో శక్తివంతమైన పవర్ హౌస్ గా మారిన పవన్ మీద అప్పటికి ఎన్నో సందేహాలు. ఓటమిని నిండుగా ఆయన ఖాతాలో వేసేందుకు వెనుకాడని వారు.. అపూర్వ విజయాన్ని సాధించిన వేళ సైతం.. గాలివాటు గెలుపుగా చేసే వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోకుండా.. తాను చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతున్నారు.


ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన రోజున పవన్ పని తీరు మీద ఎవరికి ఎలాంటి అంచనాల్లేవు.  కానీ మొదటి రోజునే పది గంటల పాటు తన శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేసిన వేళ.. మొదటిసారి ఆయనలోని 'లోతు' పంచాయితీరాజ్.. అటవీశాఖ అధికారులతో పాటు.. గ్రామీణాభివృద్ధి శాఖాధికారులకు బాగా అర్థమైంది.



తన గురించి నెగిటివ్ గా ప్రచారం చేసినా.. అభిమానులు మాత్రం ఆరాధించే వరకు వెళ్లిపోయారు. అవకాశం ఉన్న పని చేయటం.. సాయం కోసం వచ్చే వారికి.. తన దగ్గర డబ్బుల్లేకున్నాఇచ్చేసే పెద్ద మనసు గురించి ఎవరు ఎలాంటి ప్రచారం చేయకున్నా.. ప్రజలకు చేరిపోయింది.   వివిధ రంగాల్లో పట్టున్న పలువురు మేధావుల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని రోజుల తరబడి చర్చలు జరిపేవారు.  వారికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వారికి ఫ్యాన్సీ జీతాలు ఇచ్చేవారే తప్పించి.. ఉత్త చేతులతో పంపే వారు కాదు.


అలా సమాజం పట్ల ఒకలాంటి ఆర్తి పవన్ లో మొదట్నించి కనిపించేది.  ఈ క్రమంలో ఆయన అనుకున్న రీతిలో నడిచి ఉండకపోవచ్చు. కానీ.. తన చేతికి పాలనా అధికారం వస్తే తానెలా వ్యవహరిస్తానన్న విషయాన్ని చేతలతో చూపిన వ్యక్తి పవన్ కల్యాణ్. వరదలు పోటెత్తిన వేళలో.. మిగిలిన రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. తాను పని చేస్తూ. అధికారుల చేత పని చేయిచటం మొదలు.. తన శాఖకు చెందిన పనుల్ని పరుగులు పెట్టించే విషయంలో ప్రగతిని సాధించారని చెప్పాలి.


ఈ కొద్ది కాలంలో తన చేతలతో తనకో కొత్త పేరును తెచ్చుకున్నారు. అదే.. పని రాక్షసుడు. ఇప్పుడు అధికారులు మొదలుకొని..ఆయనతో కలిసి పని చేసే వారి నోటి నుంచి తరచూ వస్తున్న మాట.. పవన్ కాదు పని రాక్షసుడని.  అంతేకాదు.. తేడా జరిగితే తోలు తీస్తానన్న మాట చెప్పేందుకు వెనుకాడకపోవటం పవన్ కు మాత్రమే చెల్లిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: