చంద్రబాబు కి షాక్ ఇచ్చిన అమరావతి రైతులు..?

అమరావతి రాజధాని నిర్మాణం పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు . గత అనుభవాల దృష్ట్యా పనులు వీలైనంత వరకు వేగవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ముందుకు వస్తోంది. ఒకవైపు అమరావతి రాజధాని పనులతో పాటు సమాంతరంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం.  


కానీ దీనికి అమరావతి రైతులు అడ్డుపడుతుండడం విశేషం. ఇన్ని రోజులు చంద్రబాబు కోసం పరితపించిన వారు ఇప్పుడు వ్యతిరేకిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.  రాజధాని నిర్మాణంలో భాగంగా గుంటూరు, విజయవాడ నగరాలను అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు ఈ లైను నిర్మించనున్నారు. నంబూరు జంక్షన్ గా చేయనున్నారు. తద్వారా అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు నగరాలు అనుసంధానం కానున్నాయి.


గుంటూరు వెళ్లే అవసరం లేకుండా చెన్నై తిరుపతి కూడా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ కు సంబంధించి సర్వే జరుగుతోంది.  ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి గాను నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అమరావతిని నిర్మించేందుకు 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణ ఎలా జరిగిందో.. అలానే తమ భూములు తీసుకోవాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కంచి కర్ల మండలంలో భూసేకరణ జరుగుతోంది.  అయితే ఈ లైన్ ఏర్పాట్లు భాగంగా భూములు కోల్పోతున్నవారు తమ కుటుంబంలో ఒకరికి రైల్వే ఉద్యోగం కావాలని కోరుతున్నారు.  అలాగే గ్రామాల్లో రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రహదారులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.  దీంతో అధికారులకు షాక్ తగులుతోంది.


వీలైనంత త్వరగా అమరావతి ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2029 నాటికి పూర్తిస్థాయిలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర పాలనతో పాటు సమాంతరంగా అమరావతి పై ఫోకస్ పెట్టారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతి రైతుల నుంచి కొత్త కోరికలు వస్తుండడంతో.. ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అవుతోంది. అయితే ఈ కొత్త రైల్వే లైన్ విషయంలో రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: