తగ్గేదే లే అని..! చివరకి టికెట్ రేట్లు పెంచిన రేవంత్..?

రేవతి మరణం తర్వాత తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షో ల విషయంలో కఠినంగా ఉంటామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో సంచలన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. టికెట్ రేట్ల పెంపుదలకు తాము అంగీకరించబోమని వెల్లడించారు.  దీంతో సినీ పెద్దలు ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.  అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఎటువంటి వరాలు ప్రకటించలేదు.


బెనిఫిట్ షోల విషయంలో.. టికెట్ రేట్ల పెంపుదల విషయంలో తాము ఎటువంటి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించబోమని చెప్పిన రేవంత్ రెడ్డి.. చివరికి బెనిఫిట్ షోల విషయంలో, టికెట్ రేట్ల పెంపుదల విషయంలో యూటర్న్ తీసుకున్నారు.  గేమ్ చేంజర్ (Game changer) సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది.  బెనిఫిట్ షోలు కూడా వేసుకోవచ్చని స్పష్టం చేసింది.  ఈ చిత్రానికి నిర్మాతగా దిల్‌ రాజు ఉన్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు.


గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు తప్పు పడుతున్నప్పటికీ.. ఈ విషయంపై తొలిసారిగా నేరుగా స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.  రేవంత్ రెడ్డి డ్రామా ఒకసారిగా బయటికి వచ్చింది.  తెలంగాణలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని చెప్పారు.  టికెట్ రేట్లను పెంచమని ప్రకటించారు.. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ రేట్లను పెంచి.. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు..


గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ రేట్లను పెంచడం.. బెనిఫిట్ షోల నిర్వహణకు అనుమతి ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది.  పుష్ప సినిమా విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం.. గేమ్ చేంజర్ విషయంలో ఉదారంగా ఉండడాన్ని సినీ ప్రేమికులు తప్పుపడుతున్నారు. ” నిండు శాసనసభలో ముఖ్యమంత్రి ఆ విధంగా ప్రకటించారు. కానీ ఇప్పుడేమో ఆయన యూటర్న్ తీసుకున్నారు. తను మాట్లాడిన మాటలపై ఆయనే కట్టుబడకుండా ఉన్నారు. ఇలా అయితే ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతారు.. ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయని” సినీ ప్రేమికులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: