రేవంత్‌రెడ్డికి హాట్ వార్నింగ్ ఇచ్చిన హరీశ్‌రావు?
ఆరు గ్యారంటీలు, హామీల అమలు, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న హరీశ్‌రావు.. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు, అడిగితే అరెస్టులు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని డబ్బా కొట్టి ఇప్పుడు, ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.
మీ అణచివేతలకు, మీ నిర్బంధాలకు, మీ దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదన్న హరీశ్‌రావు.. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటం, ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్లో ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేశారని కేసు నమోదైంది. నీది ఏ పార్టీ చేయాలని సమావేశంలోనే కౌశిక్‌రెడ్డి సంజయ్‌ను తోసేశారు. దీనిపై నమోదైన కేసులో కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. అయితే తాజాగా కౌశిక్‌రెడ్డికి బెయిల్ లభించింది. దీంతో కాస్త ఊరట లభించనట్టయింది. అయితే కౌశిక్‌రెడ్డిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి.