గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడుతుందా?

ఎల్లుండి ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూఫు-2 మెయిన్ పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో పరీక్షలు వాయిదా పడతాయని, ఇతర దుష్ప్రచారం జరుగుతోంది. అయితే అటువంటివేమీ అభ్యర్ధులు నమ్మవద్దని ఎట్టి పరిస్థితుల్లోను ఈనెల 23వ తేదీన ఈపరీక్షలను సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు  ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ స్పష్టం చేశారు.


అంతే కాదు.. ఈ పరీక్షల సమయంలో ఎక్కడైనా సోషల్ మీడియా లేదా ఇతర ప్రచార మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారం చేస్తే వెంటనే స్పందించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా కలక్టర్లకు సూచించారు. అలాంటి వార్తలపై వెంటనే స్పందించి కౌంటర్ చేయడం తోపాటు తప్పుడు లేదా నకిలీ వార్తలు ప్రసారం చేస్తే అలాంటి వారిపై చట్ట పరంగా చర్యలు చేపట్టాలని సూచించారు.


ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు ప్రసారం చేసినా లేదా సర్కులేట్ చేసినా వెంటనే విచారణ చేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కూడా కలక్టర్లు, ఎస్పిలకు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎవరైనా నకిలీ వార్తలు ప్రసారం లేదా వదంతులు స్పష్టించినా అభ్యర్ధులు వారి తల్లిదండ్రులు ఏవిధమైన ఆందోళన చెందవద్దని ఆయన హితవు పలికారు.


పరీక్షల నిర్వహణకు సంబంధించి డిటైల్డ్ ఇనస్ట్రక్సన్లతో కూడిన బుక్ లెట్ ను అన్ని పరీక్షా కేంద్రాలకు పంపడం జరిగింది. ఆ సూచనలన్నీ లైజన్ అధికారులు,చీఫ్ సూపరింటిండెంట్లు,ఇన్విజిలేటర్లు తప్పక పాటించి పరీక్షలు సజావుగా జరిగేలే చూస్తారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేనివిధంగా తగిన బందోబస్సు ఏర్పాట్లు చేయాలని కలక్టర్లు, ఎస్పిలకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ సూచించారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించాలని ఏపీపీఎస్సీ ఛైర్మన్ చెప్పారు. పరీక్షా కేంద్రాల సమీపంలో పరీక్షల సమయంలో జిరాక్సు, నెట్ కేంద్రాలన్ని మూసి ఉంచాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: