వైసీపీ నేర్చుకున్న‌ పాఠాలు.. నేర్చాల్సిన పాఠాలు.. !

frame వైసీపీ నేర్చుకున్న‌ పాఠాలు.. నేర్చాల్సిన పాఠాలు.. !

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక నాయ‌కుల‌కు అనేక పాఠాలు ఒంట‌బ‌డ‌తాయి.. ఇలానే పార్టీల‌కు మ‌రిన్ని ఒంట‌బ డ‌తాయి. అయితే.. చిత్రంగా ఏపీలో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీలు పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాయి. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో నేర్చుకున్న పాఠాలు.. ఇప్పుడు నేర్చాల్సిన పాఠాలు చాలానే ఉన్నా యి. 2012లో ఆవిర్భ‌వించిన వైసీపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. తెలంగాణ విడిపో యిన త‌ర్వాత‌.. ఆ రాష్ట్రంలో సంబంధాలు తెంచుకున్నా.. అంత‌ర్గ‌త రాజ‌కీయాలు మాత్రం కొన‌సాగిస్తోం ది.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ 2019లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చారు. అలాంటి నాయ‌కుడు.. 2024కు వ‌చ్చే స‌రికి.. స‌ర్వాని స‌ర్వం.. చేతులు ఎత్తేశారు. దీనికి కార‌ణం.. తాను నాణేనికి ఒక వైపు వీక్షించ డమే! రాజ‌కీయాల్లో ఉన్న‌వారు స‌హ‌జంగా నాణేనికి రెండు వైపుల వీక్షిస్తారు. మంచి-చెడును భేరీజు  వేసుకుని ముందుకు సాగుతారు. కానీ, వైనాట్ 175 అని నిన‌దించిన గ‌ళం.. నాణేనికి ఒక వైపు చూసిన ఫ‌లితంగా కూట‌మిని త‌క్కువ‌గా అంచ‌నా వేసింది.

నేను ఇచ్చిన ప‌థ‌కాలే నాకు ర‌క్ష‌ణ‌.. మ‌న‌కు ర‌క్ష‌ణ‌.. అంటూ ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగా లు ఖ‌చ్చితం ఒక వైపు చూసిన ఫ‌లితాన్నే క‌ట్ట‌బెట్టింది. కేవ‌లం పార్టీ పెట్టడం.. వైఎస్ ఇమేజ్తో ఎద‌గ‌డం త‌ప్ప‌.. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ప‌రంగా నేర్చుకున్న పాఠం అంటూ ఏమీ లేదు. నిజానికి ఏపీలో చాలానే స్కోప్ ఉంది. దీనిని కేవ‌లం సింప‌తీ కోణంలోనే జ‌గ‌న్ చూస్తున్నారు. ఇది ఒక్క‌సారి లేదా రెండు సార్లు మాత్ర‌మే ఫ‌లిస్తుంది. వాస్త‌వానికి అన్న‌గారు ఎన్టీఆర్ చేసిన రాజ‌కీయాలు శాస్వ‌త ప్రాతిప‌దిక‌న పార్టీల‌ను  నిల‌బెడ తాయి.

సామాజిక వ‌ర్గాల‌ను చేర‌దీయ‌డంతోపాటు. స‌మాజం స‌మ‌స్య‌ల‌ను త‌న స‌మ‌స్య‌లుగా ప‌రిగ‌ణించిన‌ప్పుడు మాత్ర‌మే స‌క్సెస్ అనేది పార్టీల‌కు చేరువ అవుతుంది. కానీ, జ‌గ‌న్ వ్య‌వ‌హారం.. మాత్రం ఇలా లేద‌నే చెప్పా లి. త‌న స‌మ‌స్య‌ను స‌మాజ స‌మ‌స్య‌గా చూపించినంత వ‌ర‌కు.. ఏ పార్టీ కూడా విజ‌యం దక్కించుకున్న దాఖ‌లా లేదు. ప్ర‌స్తుతం ఈ రూపంలో వైసీపీ ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంది. త‌మ పార్టీని.. నాయ‌కుల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల్సి ఉంటుంది. అలా కాన‌ప్పుడు.. నాణేనికి ఒక‌వైపే క‌నిపిస్తుంది!!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: