
ఇక నుంచి నయా బెజవాడ... 2.0 ..!
విజయవాడ పశ్చిమ బైపాస్ సమీప ప్రాంతాల రూపురేఖలను మార్చేస్తున్నాయి. ముఖ్యంగా జక్కంపూడి, కండ్రిక, పాతపాడు, నున్న, అంబాపురం, పి.నైనవరం ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విజయవాడ బైపాస్ కారణంగా నున్న, సూరంపల్లి వరకు నిర్మాణ రంగం అభివృద్ధి పరుగులు పెడుతోంది. విజయవాడ బైపాస్ కారణంగా అవతల వైపు కూడా విస్తరణ దిశగా ముందుకు వెళుతోంది. కానూరు నుంచి నిడమనూరు దిశగా ఈ ప్రాంతం విస్తరిస్తోంది. .
విలీనం కానున్న పలు ప్రాంతాలు...
గ్రేటర్ విజయవాడ రూపాంతరం చెందే క్రమంలో విజయవాడలో చాలా ప్రాంతాలు విలీనం కానున్నాయి. అటు నందిగామ నుంచి మొదలుపెడితే ఇటు మైలవరంతో పాటు తూర్పున ఉన్న పెనమలూరు కంకిపాడు వంటి ప్రాంతాలు గ్రేటర్ విజయవాడ లో కలిసి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే గన్నవరం, హనుమాన్ జంక్షన్ వరకు కూడా విస్తరించి ఉన్న కృష్ణాజిల్లా గ్రేటర్ విజయవాడ లో కలిసే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే గ్రేటర్ విజయవాడకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది.