తిరువూరును `కెలిక`పూడి.. ఫైనల్‌గా తేల్చేసిన చంద్రబాబు..!
చంద్రబాబు ముందు రెండు సమస్యలు వెంటాడుతున్నాయి. తిరువూరులో ఎంతో మంది నాయకులు పోటీకి సిద్ధమైనా.. ఆయనే ఏరికోరి కొలిక పూడిని ఎంపిక చేశారు. ఆయనే స్వయంగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ సహా.. శ్యావల దత్‌ను బుజ్జగించి పోటీ నుంచి తప్పించారు. ఈ క్రమంలోనే స్థానికేతరుడు అయి నప్పటికీ కొలికపూడికి అవకాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఆయనే ఎదురు తిరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు చర్యలు తీసుకుంటే.. ఆయన ఎంపికే సరైంది కాదన్న సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది.
ఇక, మరో కీలక విషయం.. ఎస్సీలకు చంద్రబాబు అనుకూలం అన్న ముద్ర పడింది. దీంతో ఇప్పుడు అదేసామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుంటే.. దీనిని ఆసరా చేసుకుని వైసీపీ విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఇది మరింత మైనస్ కానుంది. ఒకవేళ చర్యలు తీసుకున్నా.. పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా రిజైన్ చేయడం.. అనేది పూర్తిగా కొలికపూడి స్వయం విషయం. సో.. సస్పెండ్ చేస్తే.. ఆయన మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు.. కర్ర విరగదు.. పాము చావదు.. అన్న ఫార్ములాను అవలంబించేలా ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలో నాయకులను సైలెంట్ చే యడం ద్వారా సమస్యలను వాటంతట అవే పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు మించి ఇప్పుడు చంద్రబాబు ముందు మరో మార్గం అయితే.. కనిపించడం లేదు. అయితే.. ఇప్పుడు ఎలాంటినిర్ణయం తీసుకున్నా.. భవిష్యత్తులో నాయకులు ఎవరూ ఇలా దూకుడు ప్రదర్శించకుండా.. చూసే ప్రయత్నంఅయితే చేయనున్నట్టు తెలుస్తోంది.