ట్రంప్‌ ఎవెన్యూ, రతన్‌టాటా రోడ్‌, గూగుల్‌ స్ట్రీట్.. రేవంత్ ఐడియా అదిరిందిపో?

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. హైదరాబాద్‌ను ప్రపంచ మ్యాప్‌లో మరింత ప్రముఖంగా నిలపాలనే సంకల్పంతో నగరంలోని ప్రధాన రహదారులకు అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు, కంపెనీల పేర్లు పెట్టే ప్రతిపాదనను రూపొందించారు. ఈ నిర్ణయం ద్వారా నగరానికి కొత్త గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు టాటా ఇంటర్‌చేంజ్ అని పేరు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు మరింత విస్తృతంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాల నుంచి ప్రారంభమై ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్‌కు భారత రత్న రతన్ టాటా పేరు పెట్టాలని రేవంత్ నిర్ణయించారు. అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచి వెళ్లే ప్రధాన రోడ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని నామకరణం చేయాలని ప్రభుతం లేఖ రాయనుంది.

ఈ విషయంపై కేంద్ర విదేశాంగ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి అధికారికంగా సమాచారం అందించనున్నారు.దిల్లీలో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ సదస్సులో రేవంత్ చేసిన ప్రకటన మేరకు గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గౌరవిస్తూ ఒక ముఖ్య రోడ్‌కు గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అదే విధంగా మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ వంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ పేర్ల ద్వారా హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుందని సీఎం భావిస్తున్నారు.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: