ఆర్‌ఎస్‌ఎస్‌ అన్ని దారుణాలు చేస్తోందా.. రాహుల్‌ గాంధీ మాటలు నిజమేనా?

లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని ఆయన ఆరోపించారు. మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపారని గుర్తు చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలపై ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యం చూపుతున్నదని విమర్శించారు. సమానత్వ భారతం కోసం తపించిన జాతిపితను హత్య చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలోని వైవిధ్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నాశనం చేస్తున్నదని ఆరోపించారు. నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారని సూచించారు. తాను ఓటు హక్కు గురించే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.ఎన్నికల కమిషన్‌ను కబ్జా చేశారని రాహుల్ ఆరోపించారు. దేశంలోని వర్శిటీలను ఇప్పటికే కబ్జా చేశారని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కబ్జా చేశారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థలను కబ్జా చేస్తున్నదని ఆయన ఆరోపించారు.

ఓట్ల చోరీకి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఈసీని బీజేపీ వాడుకుంటున్నదని విమర్శించారు. పథకం ప్రకారమే ఈసీ ఎంపిక ప్యానల్‌ నుంచి సీజేఐని తొలగించారని ఆరోపించారు.తప్పు చేసినా శిక్ష అనుభవించనవసరం లేని అవకాశాన్ని సీఈసీకి కల్పించారని రాహుల్ విమర్శించారు. ఎన్నికల తర్వాత సీసీ ఫుటేజ్‌ ధ్వంసం నిబంధన ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.

సీఈసీని కాపాడేందుకు ఏకంగా చట్టాలను మార్చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని పరోక్షంగా నియంత్రిస్తున్నారని తెలిపారు. హరియాణా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌ మోడల్‌ 23 ఓట్లు ఉన్నాయని సూచించారు. ప్రధాని ప్రచారానికి అనుగుణంగా ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ఇస్తున్నదని విమర్శించారు.ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలన్నీ ఇప్పటికే దేశం ముందు ఉంచానని రాహుల్ తెలిపారు. తన ప్రశ్నలకు ఇప్పటివరకు ఈసీ సమాధానం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఓట్ల చోరీ అనేది దేశద్రోహమని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎ


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: