ప్లీజ్ మోదీజీ.. ఆ ఒక్క పని.. బతిమాలుతున్న టీ కాంగ్రెస్ ఎంపీ?
కానీ గవర్నర్ ఆలస్యం వల్ల బీసీ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన చెందారు.ఎంపీ చామల మాటల్లో ప్రధాని మోదీపై పూర్తి ఆశలు కనిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం కోసం ప్రధాని జోక్యం చేసుకోవాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతర్జించుకుంది. రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా కీలక శక్తిగా ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన రాజకీయ లభిస్తుంది.
చామల విజ్ఞప్తి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రంలో భారీ సంచలనం సృష్టించింది. మంత్రివర్గం, అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినా గవర్నర్ ఆలస్యం చేయడం విమర్శలకు దారిారి తీసింది. ఎంపీ చామల ప్రధాని మోదీకి చేసిన విజ్ఞప్తి ఈ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. బీసీ ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చామల విజ్ఞప్తి తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకుంటే బిల్లు ఆమోదం వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. గవర్నర్ ఆలస్యం వల్ల బీసీ యువతలో అసంతృప్తి పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం ఉంది. చామల విజ్ఞప్తి కాంగ్రెస్ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు