పంచాయతీ ఫలితాలను రేవంత్ ఎక్కువగా ఊహించుకుంటున్నారా?
బీఆర్ఎస్ ఆరు నియోజకవర్గాల్లోనూ బీజేపీ ముథోల్ ఒక్కటేలోనూ మెజార్టీ సాధించింది. రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం చూపింది. రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను 2029 అసెంబ్లీ ఎన్నికలకు సూచికగా చూస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ రెండు వంతుల మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి మూడో వంతు సీట్లకు పరిమితమవుతాయని అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3511 పంచాయతీలు బీజేపీ 710 గెలుచుకున్నాయి. రెండూ కలిపి 33 శాతం స్థానాలు మాత్రమే సాధించాయి.
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు 21 అదనపు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ బలం చూపించింది. ఈ ఫలితాలు ప్రజలు కాంగ్రెస్ పాలనను ఆమోదించారని నిరూపిస్తున్నాయి.
అయితే ఈ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతమవుతాయనుకోవడం అతి ఆత్మవిశ్వాసమని కొందరు విమర్శిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు రావడం సహజం. అంతే కానీ.. ఈ ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లో వస్తాయనుకోవడం అతి ఆత్మవిశ్వాసమే అవుతుంది.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు