శభాష్‌ హరీశ్‌రావ్.. పేద విద్యార్థిని కోసం ఇల్లు తాకట్టు పెట్టేశాడు?

సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరోసారి ఉదారతను చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని మమత పీజీ వైద్య విద్య కోసం ఏటా రూ.7.5 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉండటంతో ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంది. మమత తండ్రి కొంక రామచంద్రం టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బ్యాంకు నుంచి విద్యా రుణం కోసం ప్రయత్నించగా ఆస్తి తనఖా పెట్టాలని బ్యాంకు అధికారులు షరతు విధించారు. కుటుంబంలో ఆస్తులు లేకపోవడంతో మమత, ఆమె తండ్రి హరీశ్ రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన హరీశ్ రావు సిద్దిపేటలోని తన సొంత ఇంటి పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల విద్యా రుణం మంజూరు చేయించారు. ఇది రాజకీయ నాయకుల నుంచి అరుదైన ఉదాహరణగా మారింది. మమత కుటుంబం హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపింది.హరీశ్ రావు ఈ సహాయం ఇది తొలిసారి కాదు. గతంలో సిద్దిపేటలో ఆటో డ్రైవర్ల సొసైటీకి రుణాలు రాబట్టేందుకు కూడా తన ఇంటిని తనఖా పెట్టారు. మమతకు హాస్టల్ ఖర్చుల కోసం మరో రూ.లక్ష నగదు స్వయంగా అందజేశారు. పీజీలో ఆప్తాల్మాలజీ బ్రాంచ్‌లో సీటు సాధించిన మమత భవిష్యత్తు ఇప్పుడు భరోసాతో కూడుకున్నది.

హరీశ్ రావు ఈ చర్యకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. నిరుపేద విద్యార్థుల చదువులకు ఎల్లవేళలా సహాయం చేస్తున్న హరీశ్ రావు మానవత్వం మరోసారి వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఆయన్ను ఇలాంటి ఉదారత కోసం ఎప్పుడూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.మమత కుటుంబం నలుగురు పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మమత ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ సీటు సాధించడం కుటుంబానికి గర్వకారణం కాగా ఫీజు భారం ఆందోళన కలిగించింది. హరీశ్ రావు స్పందనతో ఆ కల నెరవేరే అవకాశం ఏర్పడింది. రాజకీయ నాయకులు పేద విద్యార్థులకు సహాయం చేయడం సాధారణమే అయినా ఇలా సొంత ఆస్తిని తనఖా పెట్టడం అరుదు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: