2029నాటికి ఆ టార్గెట్ సాధిస్తానంటున్న చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటనలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే లక్ష్యాన్ని ప్రకటించారు. 2029 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు. గత ప్రభుత్వం వదిలిపెట్టిన 86 మెట్రిక్ టన్నుల చెత్తను అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగించినట్టు వివరించారు. ఫిబ్రవరి 15 నాటికి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణను శాతం శాతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్లకు 5 లక్షల రూపాయల సాయం అందిస్తామని తెలిపారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా రోజుకు వెయ్యి టన్నుల చెత్తను సేకరించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.

అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కనిపించకూడదని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుండి నడిపించే గ్రీన్ సోల్జర్లకు అభినందనలు తెలిపారు. రీసైకిల్ ఎకానమీ సృష్టించి అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని వివరించారు.సాలిడ్ వేస్ట్ నుంచి కంపోస్ట్ ఉత్పత్తి చేసి యూరియాగా మార్చడం ద్వారా రైతులకు దిగుబడులు పెరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులను నిజమైన సైనికులుగా కొనియాడారు. ఏ ఆఫీసుకు వెళ్లకుండా మొబైల్ ద్వారానే సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అరకు కాఫీకి ఆనంద్ మహీంద్రా పోస్టు చేసిన సంగతిని గుర్తుచేస్తూ దాని ప్రపంచ గుర్తింపును ప్రశంసించారు. దేశంలో అతి పెద్ద బెల్లం మార్కెట్ అనకాపల్లిలో ఉందని చెప్పారు. ఆర్గానిక్ బెల్లం ఉత్పత్తి చేస్తే ప్రపంచానికి ఎగుమతి చేసే అవకాశం ఉందని సూచించారు. రెండు నెలల్లో పోలవరం నీళ్లు అనకాపల్లికి చేరుతాయని హామీ ఇచ్చారు. గోదావరి నీటిని వంశధారకు అనుసంధానం చేస్తామని ప్రకటించారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద కేంద్రం నుంచి సహాయం కోరినట్టు చంద్రబాబు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడమే కాకుండా ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యమని చెప్పారు. చెత్త నిర్వహణలో సర్క్యులర్ ఎకానమీ పాలసీ అమలు చేస్తూ వ్యర్థాలను సంపదగా మారుస్తున్నామని వివరించారు.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: