వైసీపీకి పవన్ కల్యాణ్ యోగి ఆదిత్యనాథ్ టైప్ ట్రీట్‌మెంట్?
రౌడీలు నేరస్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శైలి ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సూచించారు. తన ఆశయ సాధన కోసం ప్రాణాలు పోయినా బాధపడనని చెప్పారు. పోయేముందు ఒక్కొక్కడిని తాట తీస్తానని హెచ్చరించారు.ప్రజల భవిష్యత్తు కోసమే తాను తగ్గి పని చేశానని పవన్ కళ్యాణ్ వివరించారు. అమ్ముడుపోయానని అనేక నిందలు వచ్చాయని గుర్తుచేశారు. ప్రజల కోసం తగ్గి పని చేయకపోతే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమయ్యేవా అని ప్రశ్నించారు.
గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో లంచాలు తీసుకుని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చి అంతు చూస్తామని వైఎస్ఆర్‌సీపీ నేతలు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో బడి పిల్లల మధ్య కులాల ప్రస్తావన చేసి రెచ్చగొట్టడం సిగ్గుచేటని విమర్శించారు. మూడు పార్టీలు ఒకే లక్ష్యంతో కలిసి వచ్చాయని చెప్పారు. అమరజీవి జలధారా పథకం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పథకం పేరును పొట్టి శ్రీరాములు పేరుతో అమరజీవి జలధారాగా మార్చామని తెలిపారు.
గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు నీటి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారని వివరించారు. ఈ పథకం ద్వారా 1.21 కోట్ల మందికి సురక్షిత మంచినీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఐదు జిల్లాల్లో రూ.7,910 కోట్లతో వాటర్ గ్రిడ్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రోడ్ల నిర్మాణం జలధారా పథకం వంటి పనుల్లో రాజీ పడితే సహించబోమని స్పష్టం చేశారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు