సైబర్‌ నేరగాళ్లను టార్గెట్ చేసిన సజ్జనార్‌?

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సైబర్ నేరాలపై తీవ్ర దృష్టి సారించారు. బయటి రాష్ట్రాల్లో ఉండి నిందితులు సైబర్ మోసాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వేరే రాష్ట్రాల్లోని నిందితులను గుర్తించడం డబ్బు రికవరీ చేయడం కష్టమవుతోందని వివరించారు. హైదరాబాద్ ప్రజలు రోజుకు కోటి రూపాయలు సైబర్ మోసాల్లో నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు రెండు మార్గాల్లో మోసాలు చేస్తున్నారని చెప్పారు. పెట్టుబడి పేరుతో మోసం చేయడం ఒకటి అయితే డిజిటల్ అరెస్ట్ ద్వారా మరొకటి అని తెలిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాల్లో వృద్ధులు రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా బాధితులవుతున్నారని పేర్కొన్నారు. అనుమానాస్పద కాల్స్ వచ్చినపుడు 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. APK ఫైల్స్ OTP బ్యాంక్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

 మ్యూల్ అకౌంట్స్ ను కట్టడి చేయడానికి RBI గవర్నర్ ను కోరారు.రాబోయే పండుగల సమయంలో సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా ఆఫర్ల పేరుతో నేరగాళ్లు మోసాలు చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. RBI UDGAM పోర్టల్ పేరుతో స్కామర్లు లింకులు పంపి మోసాలు చేస్తున్నారని ఆయన వివరించారు.
 ఆ లింకులు క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ క్రైమ్ యూనిట్ APK ఆధారిత మోసాలను రిసాల్వ్ చేసిందని తెలిపారు.

డ్రగ్ నేరగాళ్లను హిస్టరీ షీటర్లలా మానిటర్ చేస్తామని ప్రకటించారు. మ్యూల్ హంటర్ టూల్ ను బ్యాంకుల్లో అమలు చేయాలని RBI ను కోరారు. స్టూడెంట్స్ ను మ్యూల్ అకౌంట్స్ లోకి లాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ మోసాలు ఆక్సిజన్ లా మ్యూల్ అకౌంట్స్ పై ఆధారపడతాయని చెప్పారు.  ఫైనాన్షియల్ క్రైమ్ ప్రివెన్షన్ మెరుగుపరచాలని సూచించారు.సైబర్ నేరాల నిర్మూలనకు పోలీసు శాఖ చర్యలు తీవ్రతరం చేస్తోందని సజ్జనార్ తెలిపారు. గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ ద్వారా మోసాలు రిసాల్వ్ చేస్తున్నామని చెప్పారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని ప్రజలకు సలహా ఇచ్చారు.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: