పవన్ కల్యాణ్ సభలకు రావాలంటే మోడీ భయపడుతున్నారా?
రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లు నష్టపోయామని గుర్తుచేశారు. మళ్లీ రాష్ట్రం నష్టపోకుండా కూటమి ఏర్పడిందని వివరించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3050 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేశామని ప్రకటించారు. జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్‌కు అమరజీవి జలధార అని పేరు పెట్టామని చెప్పారు.అమరజీవి జలధార పథకం ద్వారా ఐదు జిల్లాల్లోని 23 నియోజకవర్గాలు 66 మండలాల్లో 67.82 లక్షల మందికి ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. ఒక జిల్లాకు పేరు పెట్టి ఆయన స్థాయిని తగ్గించారని ఆరోపించారు. పొట్టి శ్రీరాములు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని జలధార పథకానికి ఆ పేరు పెట్టామని వివరించారు. గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తాగునీటి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా 1.21 కోట్ల మందికి 35 ఏళ్ల పాటు తాగునీటి భరోసా కల్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతిపక్షం నుంచి బెదిరింపులు వస్తున్నా సహించబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు