జ‌న‌సేన‌కు ఈ నెల‌లోనే డెడ్‌లైన్ ఎందుకు.. ?

RAMAKRISHNA S.S.
జ‌నసేన‌పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఈ నెల ఆఖ‌రు నాటికి క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణయించుకున్నారు. అయితే.. ఇది ఇప్ప‌టికీ ప్రారంభం కాక‌పోవ‌డం గమ నార్హం. మ‌రో 10 రోజులు మాత్ర‌మే స‌మయం ఉంది. దీంతో ఇప్ప‌టికిప్పుడు క‌మిటీలు ఏర్పాటు చేయ‌డం సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌. నిజానికి పైస్థాయిలో జ‌న‌సేన ఉన్నంత బ‌లంగా క్షేత్ర‌స్థాయిలో లేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. పార్టీ అధినేత కూడా ఈ విష‌యాన్ని ఒప్పుకొంటున్నారు.


``క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా లేం. మీరు పుంజుకుని తీరాలంటే.. క‌మిటీల‌ను ఏర్పాటు చేయాలి. అది కూడా ఈ నెల్లోనే పూర్తిచేయాలి`` అని డిసెంబ‌రు తొలి వారంలో పార్టీ శ్రేణుల‌తో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలోనే క‌మిటీల్లో మ‌హిళ‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. జిల్లా స్థాయి నుంచి మండ‌ల స్థాయి... గ్రామ స్థాయి దాకా పార్టీనిడెవ‌ల‌ప్ చేయాల‌ని సంక‌ల్పించారు. అయితే.. ఆశించిన విధంగా ఈ క‌మిటీల ఏర్పాటు ముందుకు సాగ‌డం లేద‌న్న‌దివాస్త‌వం.


తాజాగా శుక్ర‌వారం నుంచి క‌మిటీల ఏర్పాటుపై.. జ‌న‌సేన దృష్టి పెట్ట‌నుంద‌ని చెబుతున్నారు. అయితే.. నాయ‌క‌త్వం బాధ్య‌తలు తీసుకునేందుకు కోస్తా జిల్లాల్లో ఉన్నంత‌గా.. సీయ‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పెద్ద‌గా కార్య‌క‌ర్త‌లు ముందుకు రావ‌డం లేదు. ఆయా ప‌రిస్థితుల‌ను పార్టీ అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఉత్త‌రాంధ్ర‌లో అయినా.. అంతో ఇంతో కార్య‌క‌ర్త‌లు ముందుకు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది కానీ.. సీమ‌లో అయితే.. ఇది మ‌రింత త‌క్కువ‌గానే ఉంద‌ని ప్రాధ‌మికంగా పార్టీ అంచ‌నాకు వ‌చ్చింది.


ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు పార్టీలో క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డం సాధ్య‌మేనా? అనేదిప్ర‌శ్న‌. అయితే .. అయినంత‌వ‌ర‌కు.. అందుబాటులో ఉన్న జిల్లాల్లో క‌మిటీలు ఏర్పాటు చేయ‌డం ద్వారా జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చూస్తున్నారు. ప్ర‌ధానంగా.. మహిళ‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇత‌ర పార్టీల‌నుంచి కూడా చేరిక‌ల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల త‌ర్వాత‌.. వ‌చ్చే ఏడాదినుంచి పార్టీని క్షేత్ర‌స్తాయిలో ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ప్ర‌య‌త్నాలు.. బ్లూప్రింటు కూడారెడీ చేసుకున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: