విశేష వార్తలతో ముగింపు పలుకుతున్న 2025 !

Seetha Sailaja
2025 మరో వారం రోజులలో మన అందరి జీవితాల నుండి వెళ్ళిపోతోంది. ఎప్పటిలాగే దేశవ్యాప్తంగా ప్రముఖ హోటల్స్ నుండి గేటెడ్ కమ్యూనిటీల వరకు జనం నూతన సంవత్సర ఆనందాలను సరదాగా గడపడానికి ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నారు. పబ్ లు క్లబ్ లు ఎప్పటిలాగే యూత్ ను ఆకర్షించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.


ఈసంవత్సరం మన దేశంలో మిలియనీర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిందని అదేవిధంగా ఇన్ కమ్ టాక్స్ రిటన్స్ వేసేవాళ్ళ సంఖ్య భారీగా పెరగడంతో 2040 నాటికి మన భారత్ అమెరికా చైనా ఆర్థిక వ్యవస్థలతో సమానంగా మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుందని 2047 నాటికి మన ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేనికి సమానంగా మన దేశంలో పేదరికం గణాంకాలు పెరిగిపోయి ప్రపంచ వ్యాప్తంగా తలసరి ఆదాయంలో ఇప్పటికీ మనం చాల తక్కువ స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాం.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఈసంవత్సరం కొన్ని విచిత్రాలతో గుడ్ బై చెప్పబోతోంది అన్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. లేటెస్ట్ గా ప్రముఖ ఈకామర్స్ సంస్థ స్వీగ్గీ విడుదల చేసిన కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఎవరైన ఆశ్చర్య పడటం ఖాయం. బెంగుళూరు కు చెందిన ఒక వినియోగ దారుడు ఎక్కువ సార్లు స్టార్ హోటల్స్ నుండి ఫుడ్ తెప్పించుకుంటూ తనకు ఫుడ్ తెచ్చిన డెలివరీ బాయ్స్ కు 68,600 లు కేవలం టిప్ గా ఇచ్చాడట.


అదేవిధంగా మరొక వినియోగదారుడు స్వీగ్గీ యాప్ ద్వారా కేవలం ఒక్క సంవత్సరంలో 4.3 లక్షల విలువైన ఐ ఫోన్స్ కొనుగోలు చేసాడట. మన భారతీయ సంస్కృతి గురించి ప్రముఖులు ఉపన్యాసాలు ఇస్తుంటే ప్రేమికుల రోజునాడు మన యూత్ ఇండియాలో కేవలం స్వీగ్గీ యాప్ ద్వారా నిముషానికి 666 గులాబీలు ఆర్డర్ చేశారట. ఇక ధనత్రయోదశినాడు ఈ యాప్ ద్వారా బంగారం కూడ భారీగా బహుమతులుగా పంపారట. అదేవిధంగా చెన్నైకి చెందిన ఒక వినియోగ దారుడు తాను అమితంగా ప్రేమించే ఒక కుక్క ఫుడ్ కోసం 2.41 లక్షాలు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడట. కొచ్చిన్ కు చెందిన మరొక వ్యక్తి కేవలం కరివేపాకును 368 సార్లు ఆర్డర్ ఇచ్చి మరొక రికార్డ్ క్రియేట్ చేసాడట. స్వీగ్గీ విడుదల చేసిన ఈ గణాంకాలు చూసిన వారికి భారత్ అభివృద్ది చెందుతున్న దేశం కాదు ఇప్పటికే మన ఆర్థక వ్యవస్థ అమెరికాను మించిపోయిందా అన్న సందేహాల మధ్య మన రూపాయి మాత్రం డాలర్ విలువ ముందు నిలబడలేక పడిపోతూ ఉండటం ఎవరికి అర్థంకాని విషయం..    
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: