జగన్, చంద్రబాబు, మోడీ.. ఎవరు అడ్డం వస్తారో చూస్తా.. రేవంత్ ఫైర్?
అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచి నీటిని తెచ్చుకుంటామని తెలిపారు. తొంభై టీఎంసీలు ఇవ్వకపోతే జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకుంటామని ఆయన ధీమాగా చెప్పారు. మా నీటిని తీసుకెళ్లకుండా ఆపడానికి ఎవరు వచ్చినా చూస్తానని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనేదే తన సంకల్పమని రేవంత్ పేర్కొన్నారు. చిన్న వయసులోనే దేవుడు మంచి అవకాశం ఇచ్చాడని ఆయన అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు కేసీఆర్ వస్తారనుకున్నానని చెప్పారు. హరీష్ రావు కూడా రాలేదని విచారం వ్యక్తం చేశారు. జగన్‌ను ఇంటికి పిలిచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు కేసీఆర్ అనుమతి ఇచ్చారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపించానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందని ఆయన వివరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితేనే చర్చలకు వస్తామని చంద్రబాబుకు చెప్పానని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయిందో లేదో నిజనిర్ధారణ కమిటీ వేయాలని సూచించారు. తన మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని ఆయన చెప్పారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు