చంద్రబాబు కొత్త ప్రాజెక్టుతో తెలంగాణకు పెనుముప్పు పొంచి ఉందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నట్టు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకుంటే తప్పేమిటని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు. నీటి వాటాలు స్పష్టంగా తేలకముందే మిగులు జలాలు అనడం సరికాదని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

తొంభై టీఎంసీల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. వివాదరహితమైన నలభై అయిదు టీఎంసీలకు ముందుగా అనుమతి ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. నలభై అయిదు టీఎంసీలకు సంబంధించి త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటామని ఉత్తమ్ ప్రకటించారు. వివాద పరిష్కారం తర్వాత మరో నలభై అయిదు టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా ప్రాజెక్టులను మార్చడం సరికాదని కూనంనేని సాంబశివరావుఅభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను మార్చకపోవడం సంతోషకరమని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. తక్కువ నిధులు అవసరమైన చిన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో సగమైనా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు మారు పేరుగా మారిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళిక వేసింది. తెలంగాణ గోదావరి వాటా 1,119 టీఎంసీలకు ముప్పు వాటిల్లుతుందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీపీఆర్ సిద్ధం చేసి ముందుకు సాగుతుండటంతో తెలంగాణ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు పోలవరం బ్యాక్ వాటర్ స్థాయి పెరిగితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముంపు ముప్పు పొంచి ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. గోదావరి వాటాలు పూర్తిగా తేలకముందే మిగులు జలాలను మళ్లించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తోంది.

9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: