తెలంగాణతో జలవివాదం.. చాకచక్యంగా స్పందించిన చంద్రబాబు?
రాజకీయ విభేదాలు నీటి పంచాయతీకి అడ్డురాకూడదని చంద్రబాబు హితవు చెప్పారు.గత ఏడాది కృష్ణా గోదావరి నదుల నుంచి 6 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథా పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం చెప్పలేదని ఆయన తెలిపారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని గుర్తుచేస్తూ ఎటువంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. పోలవరం కృష్ణా-గోదావరి లింకింగ్ వంటి ప్రాజెక్టులు దేశంలో నీటి సమస్యలు తీరుస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
గంగా-కావేరి నదులు కలపాలని ఆయన ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా నీటి కొరత పోగొట్టడానికి ఈ లింకింగ్ అవసరమని వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాకుండా సమైక్యత అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఐకమత్యంతో తెలుగువారు ప్రపంచంలో అగ్రగాములవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు మరచి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.చంద్రబాబు చాణక్యనీతి తెలంగాణతో జల వివాదాలు పరిష్కరించడంలో కనిపిస్తోంది.
బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు లేవనేస్తున్నా రెండు రాష్ట్రాలు కలిసి గోదావరి జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. విభజన తర్వాత రాష్ట్రాల మధ్య సమస్యలు పెరిగినా ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. గోదావరి నీరు సముద్రంలోకి వృథా పోకుండా రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.