కొత్త వారిలో సగం మంది ఔట్.. టీడీపీ లెక్కలు ఇవే.. !
సొంత గెలుస్తామని అనుకుంటే.. తక్షణమే రాజీనామా చేయొచ్చని చంద్రబాబు, లోకేష్‌లు కూడా వ్యాఖ్యా నించారు. అయితే.. అధిష్టానం సీరియస్ అయినప్పుడు మాత్రం కొంత వరకు నాయకులు సర్దుబాటు చేసుకుంటున్నారు. కానీ, తర్వాత మాత్రం మళ్లీ మామూలే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.శ్రీకాళహస్తి, కడప, గుంటూరు వెస్ట్, విజయవాడ సమీపంలోని తిరువూరు, అనంతపురంలోని అర్బన్, పుట్టపర్తి, శింగన మల.. ఇలా పదుల సంఖ్యలో నియోజకవర్గాలు వివాదాల్లో ఉన్నాయి ..
వీటిపై ఎప్పటికప్పుడు పార్టీ నివేదికలు తెప్పించుకుంటోంది. తద్వారా.. వారి వ్యవహారంపై దృష్టి పెట్టిం ది. కొన్నాళ్ల పాటు ఇలాంటి వారికి నయాన భయాన చెప్పి చూస్తున్నారు. కానీ, మార్పు కనిపించడం లేదని భావిస్తున్న సగానికి పైగా నియోజకవర్గాల్లో మార్పులు చేయడం తథ్యమని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయించిన నియోజకవర్గాల్లో వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ..
ఏ చిన్న తేడా వచ్చినా.. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ పుంజుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో మరో మాటే లేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు తప్పవన్న సంకేతాలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని తెలుస్తోంది. దీనిని ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. కూటమి గెలుపు కోసం.. ఎవరినీ స్పేర్ చేసే అవకాశం ఉండదన్న చర్చ జోరుగా టీడీపీలో వినిపిస్తోంది ..