నల్లమలసాగర్.. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గిఫ్ట్‌గా ఇచ్చారా?
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణార్హత లేని పిటిషన్ వేసి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. రిట్ పిటిషన్ వెనక్కి తీసుకుని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం ఏపీకి సమయం ఇవ్వడమేనని హరీశ్ అన్నారు. సీజేఐ సూచన మేరకు పిటిషన్ డిస్పోజ్ చేసినట్టు ప్రకటించారని తెలిపారు. ఇది తెలంగాణ నీటి హక్కులను సుప్రీం కోర్టు సాక్షిగా ధారపోసినట్టుందని విమర్శించారు.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు గోదావరి నీటిని తరలించడానికి రూపొందించబడింది. తెలంగాణ ఈ ప్రాజెక్టు తమ భూములు ముంపుకు గురవుతాయని వ్యతిరేకిస్తోంది. సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ వెనక్కి తీసుకోవడం వల్ల ఏపీకి నిర్మాణాలు పూర్తి చేసుకునే సమయం లభిస్తుందని హరీశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
సివిల్ సూట్ దాఖలు చేయడం వల్ల నాలుగు రాష్ట్రాల వాదనలు వినడానికి ఏళ్లు పడుతుందని ఆయన అన్నారు. ఇది తెలంగాణకు ద్రోహం అని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం మేము ఏపీ ఉల్లంఘనలు కోర్టు దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. స్టాప్ వర్క్ ఆర్డర్ అమలు చేయకపోవడం గత డిజైన్ మించి చేస్తున్న నిర్మాణాలు ఆపాలని వాదించామని తెలిపారు. సీజేఐ సూచనల మేరకు సివిల్ సూట్ ఫైల్ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు ఈ ప్రాజెక్టు తెలంగాణకు నష్టం కలిగించదని స్పష్టం చేశారు.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.