తెలుగు మీడియా స్వ‌తంత్ర‌త‌.. కొన్ని ప్ర‌శ్న‌లు.. !

RAMAKRISHNA S.S.
ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మ‌రోసారి మీడియా స్వ‌తంత్ర‌త‌కు సంబంధించిన ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి మీడియాకు ల‌క్ష్మ‌ణ రేఖ‌లు లేవు. రాజ్యాంగంలోనూ దీనికి పెద్ద‌గా ఎలాంటి నిబంధ‌న లు కూడా విధించ‌లేదు. ఎందుకంటే.. మీడియా అంటే.. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చేత ఏర్ప‌డిన ప్ర‌జాస్వా మ్యంలో బాధ్య‌త‌గా ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే దీనికి ఎవ‌రూ ఎలాంటి ల‌క్ష్మ‌ణ రేఖ‌లు పెట్ట‌లేదు. అంతేకా దు.. మీడియాలోకి వ‌చ్చివారిపైనా నాటి రాజ్యాంగ పెద్ద‌ల‌కు అచెంచ‌ల విశ్వాసం ఉంది.


ఉన్న‌త విద్య‌లు అభ్య‌సించి, స‌మాజం ప‌ట్ల‌, ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించేవారే.. మీడియా ముందుకు వ‌స్తార‌ని రాజ్యాంగ నిర్మాత‌లు భావించి ఉంటారు. అయితే.. రాను రాను.. మీడియాకు బాధ్య‌త స‌న్న‌గిల్లింది. అధికారంలో ఉన్న‌వారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు వ‌ర్గాలుగా చీలిపోయిన మీడియా.. ఇప్పుడు ఏకంగా.. హ‌ద్దులు దాటేసిందనే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా ఎన్‌టీవీ క‌థ‌నం సంచ‌ల‌నంగా మారింది.


ఏకంగా ఓఐఏఎస్ అధికారికి.. మంత్రికి ముడిపెట్టి వండి వార్చిన క‌థ‌నం.. అనేక పుంత‌లు తొక్కింది. మీడియా స్వ‌తంత్ర‌ను ప్ర‌శ్నించేలా చేసింది. ఇక‌, దీనికి కొన‌సాగింపుగా మ‌రో ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం.. తెలంగాణ ఉప‌ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ను టార్కెట్ చేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనిని మంత్రి ఒప్పుకొన్నారు  కూడా. త‌న‌ను టార్గెట్ చేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఒక మీడియాపై మ‌రోమీడియా దాడులు చేయ‌డం.. స్వ‌తంత్ర పేరుతో రాయ‌డం ప్ర‌శ్న‌గా మారింది.


వాస్త‌వానికి 2014కు ముందు.. కేంద్రం వేసిన మాజీ జ‌స్టిస్ మార్కండేయ ఖ‌ట్జు కీల‌క సిఫార‌సులు చేశారు. మీడియాకు ల‌క్ష్మ‌ణ రేఖ‌లు ఉండాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జా బాహుళ్యాన్ని ఇరుకున పెట్టేలా.. ప్ర‌జ‌ల కు ఉప‌యోగం లేని క‌థ‌నాల‌ను వండివార్చేలా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. అదేస‌మ‌యంలో మీడియా ప్ర‌తినిధుల‌కు, జ‌ర్న‌లిస్టులకు కూడా.. విద్యార్హ‌త‌ల‌ను నిర్దేశించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తేల్చి చెప్పారు. కానీ, నాడు ఖ‌ట్జుపై ఇదే మీడియా దాడి చేసింది. సో.. మొత్తానికి నేటి మీడియా ప‌రిస్థితి గొంగ‌ట్లో తింటూ.. అనే సామెత‌ను గుర్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: