అసెంబ్లీలో చెవులు కుట్టించే కార్యక్రమం, ఆడుకున్న అన్నాడిఎంకే..!

RAMAKRISHNA S.S.
త‌మిళ‌నాడులో ఈ యేడాది జ‌రిగే ఎన్నిక‌ల వేళ అధికార డీఎంకే కూట‌మి వ‌ర్సెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న అన్నాడీఎంకే కూట‌మి మ‌ధ్య ఎత్తులు ... పై ఎత్తుల‌తో రాజ‌కీయం అదిరిపోతోంది. మ‌రీ ముఖ్యంగా అన్నాడీఎంకే సోష‌ల్ మీడియాలో వేసే సైటైర్లు అయితే సోష‌ల్ మీడియాలో పేలిపోతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప జేస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో తమిళనాట, ప్రతిపక్ష అన్నాడిఎంకే చేస్తున్న రాజకీయం అధికార డిఎంకేకి చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తోంది. తాజాగా తమిళనాడు సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఎన్నికల ఏడాది కావడంతో, తాత్కాలిక బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టింది. అన్ని వర్గాలకు న్యాయం చేసే బడ్జెట్ అంటూ డిఎంకె సర్కార్ ప్రచారం చేసినప్పటికీ.. సిఎం స్టాలిన్, ఆర్ధిక శాఖా మంత్రితో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకిపారేసింది అన్నాడిఎంకే.

 

ఓ వీడియో, ఆహ్వాన పత్రికను రెడీ చేసి.. ఓ రేంజ్ సెటైర్ వేసింది. బడ్జెట్ పేరుతో ప్రజల చెవులకు పోగులు కుట్టించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు అంటూ సెటైర్ లు వేసింది. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో, ఓ వింత ఆహ్వాన పత్రికతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంట్రీ ఇచ్చారు. 'బడ్జెట్ పేరుతో తమిళనాడు ప్రజలకు డీఎంకే ప్రభుత్వం చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహిస్తోంది' అని ఆరోపిస్తూ ఓ ఆహ్వాన పత్రికను తీసుకుని సభలోకి వచ్చారు ఎమ్మెల్యేలు. తేదీ: ఫిబ్రవరి 17, 2026, స్థలం : తమిళనాడు శాసనసభ, సమయం: ఉదయం 10 గంటల నుండి 'ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, చెవులు కుట్టే కార్యక్రమానికి ఆర్థిక మంత్రి తంగం తమరసు నాయకత్వం వహిస్తారని ఎద్దేవా చేసింది.

 

గత నాలుగున్నరేళ్లుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందని, ఈ ఏడాది కూడా అలాగే ఘనంగా ఏర్పాటు చేసిందని ఆహ్వాన పత్రికలో పేర్కొంది. ఇక వీడియోలు అధికార డిఎంకే నేతలు ఓ పెద్ద సూది పట్టుకుని ప్రజలకు చెవులు కుట్టేందుకు వెళ్తూ ఉంటారు. వారిని చూసి ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: