“అంబేద్కర్ దూరవిద్యా” యూనివర్సిటీ లో “బీఈడీ” నోటిఫికేషన్
హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్యా
విధానంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్
ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్ష - 2018 ప్రకటన వెలువడింది...ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఏదన్నా డిగ్రీ
తో పాటు డీఈడీ లేదా ఉపాద్యాయ శిక్షణ అర్హత ఉండాలి..అంతేకాదు ఎంట్రన్స్ టెస్ట్ కూడా
ఉంటుంది..
కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)
వ్యవధి: రెండేళ్లు
మాధ్యమం: తెలుగు.
అర్హతలు: ఏదైనా డిగ్రీతో పాటు డీఈడీ లేదా ఇతర ఉపాధ్యాయ శిక్షణార్హత ఉండాలి.
బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)
వ్యవధి: రెండున్నరేళ్లు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.
ఎంట్రన్స్ టెస్ట్ (బీఈడీ): ప్రశ్నపత్రంలో 100 ఆబ్జెక్టివ్ టైప్
(మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు; ప్రొఫీషియెన్సీ ఇన్ తెలుగు
నుంచి 25 ప్రశ్నలు; జనరల్ మెంటల్
ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలుంటాయి.
ఎంట్రన్స్ టెస్ట్
(బీఈడీ-ఎస్ఈ): ప్రశ్నపత్రంలో 100 ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్) ప్రశ్నలుంటాయి. జనరల్
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ నుంచి 40 ప్రశ్నలు; జనరల్ మెంటల్ ఎబిలిటీ: లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్: వెర్బల్ అండ్ ఆబ్స్ట్రాక్ట్
రీజనింగ్ నుంచి 60 ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.400
దరఖాస్తుకు చివరితేదీ: మే 15, 2018.
ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 3, 2018
పూర్తి వివరాలు
వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.braouonline.in