విశాఖ “డ్రెడ్జింగ్ కార్పొరేషన్” లో ఉద్యోగాలు..

Bhavannarayana Nch

విశాఖపట్నంలోని భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..ఈ నోటిఫికేషన్ ప్రకారం దీంట్లో మొత్తం పోస్టుల వివరాలు..60 వీటిలో డ్రైడ్జ్ క్యాడెట్స్.. ట్రైనీ మెరైన్ ఇంజనీర్ ఇలా పలురకాల విభాగాలలో ఖాళీలు ఉన్నాయి..వివరాలలోకి వెళ్తే..


పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీలు- 60

డ్రైడ్జ్ క్యాడెట్స్ - 15

ట్రైనీ మెరైన్ ఇంజనీర్ - 15

ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ - 15

ఎన్‌సీవీ (ట్రైనీస్)- 15

అర్హత: పదోతరగతి, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఆయా బ్రాంచుల్లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణత. 

వయసు: 25 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.1000. (ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించనవ సరం లేదు)

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 1, 2018.

మరిన్ని వివరాలు వె బ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.dredge-india.com

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: