“ఏపీ వైద్య శాఖ” 1900 ఉద్యోగాలు “ఈరోజే”.. ఆఖరుతేది..!!!!
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 1900 ఉద్యోగాలకి ఈ రోజే
ఆఖరుతేదీ. ఏపీ ప్రభుత్వం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో దాదాపు 1900 ఏఎన్ఎం, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది...
జిల్లాల వారీగా...ఖాళీలు: శ్రీకాకుళం-52, విజయనగరం-29, విశాఖపట్నం-150, తూర్పుగోదావరి-227, పశ్చిమ గోదావరి-193, కృష్ణా-168, గుంటూరు-242, ప్రకాశం-99, నెల్లూరు-176, చిత్తూరు-182, వైఎస్సార్-97, అనంతపురం-140, కర్నూలు-145.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ నర్సింగ్ అండ్
మిడ్వైవ్స్ కౌన్సిల్ నుంచి ఎంసీహెచ్ఏ కోర్సు చేసి ఉండాలి లేదా ఇంటర్ ఒకేషనల్
(ఎంపీడబ్ల్యూహెచ్) కోర్స్ పూర్తిచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్లినికల్ అనుభవం
ఉండాలి.
వయసు: ఫిబ్రవరి 1, 2019 నాటికి గరిష్టంగా 42 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో. వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్
చేసుకోవాలి. దరఖాస్తుకు డీడీ జతచేసి సంబంధిత జిల్లా కార్యాలయంలో అందించాలి.
దరఖాస్తుకు
చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://cfw.ap.nic.in