"SSC"..లో ఉద్యోగాలు...ఆఖరు తేదీ :
ఎస్ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)
లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా “కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్” (సీహెచ్ఎస్ఎల్)-2019 లో ఉద్యోగాల
భర్తీ నిర్వహించనుంది. అర్హతలు, ఖాళీల వివరాలు, వెబ్సైటు లో పూర్తి సమాచారంతో
అందుబాటులో ఉన్నాయి.
పోస్టులు: వివిధ
మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ
చేస్తారు.
అర్హత: లోయర్
డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్
అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా
ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ మినహా) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి
ఇంటర్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ)
పోస్టులకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్/తత్సమాన
కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య
ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక: టైర్-1, 2, 3 పరీక్షల ఆధారంగా.
ఆబ్జెక్టివ్ విధానంలో
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. 60 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. 2-4 విభాగాల్లో ప్రశ్నలు
ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.100. (రిజర్వేషన్
వర్గాలకు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 5, 2019.
ఫీజు చెల్లించడానికి చివరి
తేదీ: ఏప్రిల్ 7, 2019.
టైర్-1: 2019, జూలై 1-26.
టైర్-2 (డిస్క్రిప్టివ్): సెప్టెంబర్ 29, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in