"10th పాస్" అయిన వారికి..."సివిల్స్" లో శిక్షణ...!!!!
కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ ఇవ్వబడుతుందని శ్రీ దుర్గ మల్లేశ్వర సంత్కృతాంధ్ర కళాశాల తెలిపింది. ఈ కళాశాల కృష్ణా విశ్వవిద్యాలయం అనుంధ కళాశాలకి గుర్తింపు పొంది ఉందని ఓ ప్రకటనలో తెలిపింది. వీరి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల ఇంటిగ్రెటెడ్ కోర్సును ఉచితంగా అందిస్తున్నారు. 2019–20 విద్యా సంవత్సరం నుంచీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో.. “తెలుగు మెయిన్స్ సివిల్స్ కోచింగ్” దిశగా బి.ఎ(ఓ.ఎల్) తెలుగు, సంస్కృతం కోర్సుల బోధన నిర్వహిస్తున్నారు.
అందించే కోర్సులు : బీ.ఏ(ఓ.ఎల్) తెలుగు, బీ.ఏ(ఓ.ఎల్)
సంస్కృతం
సీట్ల వివరాలు..
బీ.ఏ(ఓ.ఎల్) తెలుగు : 50 సీట్లు
బీ.ఏ(ఓ.ఎల్) సంస్కృతం : 50 సీట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వ తరుపున రావాల్సిన
స్కాలర్‌షిప్ సౌకర్యం కలదు.
చిరునామ: డోర్.నెం: 21–138/7, అట్కిన్‌సన్ స్కూల్ రోడ్, గొల్లపూడి, విజయవాడ–521225
ఫోన్ నెంబర్లు: 0866–2975646, 8331915646