డిగ్రీ అర్హతతో ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగాలు....
'ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT-2020) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 1న మొదలు అయంది. ఈ దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు 2021 జనవరిలో కోర్సు మొదలు పెట్టబోతున్నారు. ప్రతీ సంవత్సరం రెండుసార్లు AFCAT ప్రకటన వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే కదా . మే/జూన్ నెలలో మొదటి విడత, డిసెంబరులో రెండో విడత నోటిఫికేషన్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విడుదల చేయడం జరుగుతుంది.
ఇక వివిధ పోస్టుల వివరాలు ఇలా... మొత్తం ఖాళీలు: 249 , విభాగాలు విషయానికి వస్తే ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్). వివిధ పోస్టుల విభాగాల వారీగా ఖాళీలు ఇలా...
* ఫ్లైయింగ్ (SSC)- 60
* గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 105
* గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్) - 84
* ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్)- CDSE, AFCATలో 10 % సీట్లు
ఇక పూర్తి అర్హత విషయానికి వస్తే డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ బీకాం డిగ్రీతో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత కచ్చితంగా ఉండాలి. NCC సర్టిఫికెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కచ్చితంగా సంబంధిత అభ్యర్థుల దగ్గర ఉండాలి.
ఇక వయసు వయోపరిమితి మాత్రం ఫ్లైయింగ్ బ్రాంచ్ పోస్టులకు 01.07.2020 నాటికి 20 నుంచి 24 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. మిగతా బ్రాంచ్ పోస్టులకు 20 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు అవకాశం కూడా ఉంది. ఇక దరఖాస్తు విధానం మాత్రం ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వివిధ పోస్టుల ఎంపిక విధానం విషయానికి వస్తే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అసలు విషయమైనా దరఖాస్తు ఫీజు ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ.250 చెల్లించవలసి ఉంటుంది. మిగతా విభాగాలకు ఫీజు నుంచి మినహాయింపు అవకాశం కూడా ఉంది. ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఇక ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ..
➦ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియ ప్రారంభం: 01.12.2019
➦ ఆన్లైన్లో దరఖాస్తుకు చేసుకోవడానికి చివరితేది: 30.12.2019
➦ పరీక్ష తేది: ఫిబ్రవరి 22, 23 తేదీల్లో.
➦ కోర్సు ప్రారంభం తేదీ: 2021 జనవరిలో.
ఆసక్తి అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము