ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల ఆహ్వానం
ప్రతిభ ఉండి ఉన్నత విద్య అభ్యసించడానికి తగిన ఆర్థిక పరిస్థితులు లేని 10వ తరగతి విద్యార్థినులకు శుభవార్త. ఇంటర్మీడియట్ చదవాలనుకునే అమ్మాయిలకు రూ.22 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్కాలర్‌షిప్‌కు విద్యార్థినులను ఎంపిక చేసేందుకు ఈ నెల 15న గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలో గెస్ట్ స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి చదువుతున్న బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కోరడం జరిగింది.
ప్రతిభ గల 10వ తరగతి బాలికలకు ఇంటర్మీడియట్ విద్య కోసం ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు గత 5 ఏళ్లుగా GEST స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహిస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఈసారి కూడా ఇంటర్ చదవాలనుకునే అమ్మాయిల్ని స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేయనుంది. మొత్తం 25 మంది అమ్మాయిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్‌షిప్స్ ఇస్తుంది. ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్ 12 లోగా www.ntrtrust.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 7660002627, 7660002628 ఫోన్ నెంబర్లలో సంప్రదించొచ్చు.
ఇక అర్హత విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2020 మార్చిలో 10వ తరగతి రాసే అమ్మాయిలందరూ GEST స్కాలర్‌షిప్ టెస్ట్‌కు దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 12
ఇక పరీక్షా విధాన విషయానికి వస్తే 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 గంటల్లో పరీక్ష రాయాలి. 10వ తరగతి స్టాండర్డ్‌లో ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. మ్యాథ్స్-20, సైన్స్-20, సోషల్-20, ఇంగ్లీష్-20, కరెంట్ ఎఫైర్స్, జీకే, రీజనింగ్- 20 మార్కులు.
స్కాలర్‌షిప్: GEST స్కాలర్‌షిప్ టెస్ట్‌లో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం లభిస్తుంది. 11 నుంచి 25 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3,000 చొప్పున స్కాలర్‌షిప్ అందుతుంది. ఈ విద్యార్థులకు ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఈ ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది.