నిరుద్యోగులకు శుభ వార్త... కోల్ ఇండియాలో 1326 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల...

Suma Kallamadi

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి శుభ వార్త తెలియచేసింది. బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కోల్ ఇండియా లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అర్హత గల  అభ్యర్థులు డిసెంబరు 21 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అని  తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరిలో ఆన్‌లైన్లో రాతపరీక్ష నిర్వహించడం జరుగుతుంది అని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

 

ఇక పోస్టుల  వివరాలు ఇలా..
మేనేజ్‌మెంట్ ట్రైనీ: 1326 పోస్టులు

వివిధ విభాగాల వారీగా  పోస్టుల వివరాలు ఇలా
జనరల్-485
ఈడబ్ల్యూఎస్-132
ఎస్సీ-206
ఎస్టీ-142
ఓబీసీ (NCL)-361.

 

విభాగాల వారీగా ఖాళీల వివరాల ఇలా...
 
మైనింగ్: 228
ఎలక్ట్రికల్: 218
మెకానికల్: 258
సివిల్: 68
కోల్ ప్రిపరేషన్: 28
 సిస్టమ్స్: 46
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్: 28
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 254
పర్సనల్ & హెచ్ఆర్: 89
మార్కెటింగ్ & సేల్స్: 23 
కమ్యూనిటీ డెవలప్‌మెంట్: 26

 

ఇక పోస్టుల వారీగా విద్య అర్హత నియమించడం జరిగింది. ఇక అర్హత వివరాల విషయానికి వస్తే బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్), సీఏ/ఐసీడబ్ల్యూఏ, పీజీ డిగ్రీ (హెచ్ఆర్/పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్)/ఎంబీఏ/ మాస్టర్ డిగ్రీ(సోషల్ వర్క్), పీజీ డిగ్రీ అర్హత కచ్చితంగా ఉండాలి. ఇక వయసు వయోపరిమితి మాత్రం   అభ్యర్థుల వయసు 01.04.2020 నాటికి 30 సంవత్సరాలలోపు కచ్చితంగా ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు అవకాశం కూడా ఉంది.


ఇక ముఖ్యమైన దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి చాలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు కూడా ఉంది. వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 

ఇక దరఖాస్తు విధానం విషయానికి వస్తే   ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపిక విధానం మాత్రం  ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష్, మెడికల్ టెస్ట్ ద్వారా.మొత్తం 200 ప్రశ్నలకుగాను 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. 


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం తేదీ: 21.12.2019 (10.00 AM)
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరి తేది: 19.01.2020 (11.00 PM)
ఆన్‌లైన్ పరీక్ష తేది: 27.02.2020 & 28.02.2020

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: