తెలంగాణలోని న్యాయస్థానాలకు సంబంధించి ఉద్యోగాల ప్రకటన
తెలంగాణలోని న్యాయస్థానాలకు రాష్ట్రప్రభుత్వం 450 పోస్టులను మంజూరుచేసింది. ఇందులో హైకోర్టులకు 183 సూపర్ న్యూమరరీ పోస్టులను, దిగువ కోర్టులకు 267 అదనపు పోస్టులను కేటాయిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు డిసెంబరు 19న ఉత్తర్వులు జారీ చేశారు. దిగువ కోర్టుల పోస్టులు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఆధ్వర్యంలో ఇవి ఉండనున్నాయి.
హైకోర్టుకు మంజూరుచేసిన 183 సూపర్ న్యూమరీ పోస్టుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ ఒక లుక్ వేయండి.
మొత్తం ఖాళీల సంఖ్య: 183
జాయింట్ రిజిస్ట్రార్: 01, డిప్యూటీ రిజిస్ట్రార్: 03, సెక్షన్‌ఆఫీసర్/ కోర్టు ఆఫీసర్/ స్ర్కూట్నీ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్: 50, కోర్టుమాస్టర్/న్యాయమూర్తులు/ రిజిస్ట్రార్ పీఎస్‌లు: 11, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు: 24, ఎగ్జామినర్: 03, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 12, డ్రైవర్: 30, రికార్టు అసిస్టెంట్‌లు: 39 ఇలా మొత్తం 183 పోస్టులు ఉన్నాయి.
దిగువ కోర్టుల పోస్టుల వివరాల విషయానికి వస్తే.. దిగువ కోర్టుల్లో 267 పోస్టులకుగానూ.. 260 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఉన్నాయి. వీరిని జిల్లా కోర్టులు, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టుల, జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో నియమిస్తారు.
పోస్టుల పూర్తి వివరాల వివరా విషయానికి వస్తే... మొత్తం ఖాళీల సంఖ్య: 267, పబ్లిక్ ప్రాసిక్యూటర్/జేపీవోపీ: 04, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (గ్రేడ్-1): 116, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (గ్రేడ్-2): 39, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్: 101, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరల్): 01, సూపరింటెండెంట్: 02, సీనియర్ అసిస్టెంట్: 03.
పూర్తి వివరాలకోసం ఈ సైట్ ని చుడండి: https://hc.ts.nic.in/getRecruitDetails?_ga=2.242478658.1989846807.1576905255-1319345680.1573284693
మరి ఎందుకు ఆలస్యం, ఎక్కువ లేదు, చదవడం మొదలు పెట్టేయండి... ఉద్యోగం కొట్టేయండి. ఆల్ ది బెస్ట్.