నిరుద్యోగులకు గుడ్ న్యూస్...ఈశాన్య  రైల్వేలో 1104 ఉద్యోగాలకు నోటిఫికేషన్... డిసెంబర్ 25 చివరి తేదీ...

Suma Kallamadi

తాజాగా నిరుద్యోగులకు భారతీయ రైల్వే చాల నోటిఫికెషన్స్ విడుదల చేస్తూ శుభవార్తలు తీసుకొని వస్తుంది.  అన్ని జోన్లు ఒకటి తర్వాత మరొకటి  రైల్వేలో నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. గత కొద్ది రోజుల ముందే దక్షిణ మధ్య రైల్వే-సికింద్రాబాద్ 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి  తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈశాన్య రైల్వే మరో 1104 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలు అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక దరఖాస్తులు చేసుకోవడానికి   2019 డిసెంబర్ 25 చివరి తేదీ అని నోటిఫికేషన్ తెలియాచేస్తుంది. 

 

ఇక  ఈశాన్య రైల్వేలో గోరఖ్‌పూర్‌లోని మెకానికల్, సిగ్నల్, బ్రిడ్జ్ వర్క్‌షాప్, ఇజ్జత్ నగర్‌లోని మెకానికల్ వర్క్‌షాప్, డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వేగన్, లక్నోలోని క్యారేజ్ అండ్ వేగన్, గోండాలోని డీజిల్‌షెడ్‌లో ఇలా చాల పోస్టులకు నోటిఫికేషన్  భర్తీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కు ఇంకా మరిన్ని వివరాలను ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెల్సుకోవచ్చు.

 

ఈశాన్య రైల్వేలో పోస్టుల వివరాలు ఇలా...
మొత్తం ఖాళీలు- 1104  

 

వివిధ పోస్టులకు సంబంధింత గ్రూప్ వారి పోస్టుల వివరాలు ఇలా...
ఫిట్టర్- 494
వెల్డర్- 121
ఎలక్ట్రీషియన్- 99 
కార్పెంటర్- 145పెయింటర్- 106
మెషినిస్ట్- 1
టర్నర్-15
మెకానిక్ డీజిల్- 85
ట్రిమ్మర్- 8  

 

ముఖ్యమైన తేదీలు ..
దరఖాస్తు  చేసుకోవడానికి ప్రక్రియ ప్రారంభం తేదీ : 2019 నవంబర్ 26
దరఖాస్తు చేసుకోవడాని చివరి తేదీ : 2019 డిసెంబర్ 25
ఇక శిక్షణ ప్రారంభం తేదీ - 2020 ఏప్రిల్ 1

 

ఇక విద్యార్హత విషయానికి వస్తే.. కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ కచ్చితంగా కలిగి ఉండాలి. ఇక వయస్సు వయోపరిమితి మాత్రం  15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఇక దరఖాస్తు ఫీజు మాత్రం  రూ.100. ఇక  ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళలకు అటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు డిసెంబర్  25 లోపు దరఖాస్తు చేసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: