ముహూర్తం కుదిరింది...ఇక ముందుండి ముసళ్ల పండుగ

DRK Raju
మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్ మీడియట్ , పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఎస్.ఎస్.సి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత శాఖాధికారులతో ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరీక్షల సన్నద్దతను సమీక్షిస్తు పలు సూచనలు అందించారు. పరీక్షల నిర్వహణలో గత సంవత్సరం జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్యకమిటీ సూచనలను ఈ రెండు శాఖలు అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో అమలు చేయడం తో పాటు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించటానికి అదనపు చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు.

తప్పులపై అవగాహన..

ప్రతి ఎవాల్యూయేటర్  కు అవసరమైన పూర్తి స్థాయి శిక్షణను అందించి గత సంవత్సరంలో సాధారణంగా జరిగిన తప్పులపై అవగాహన కల్పించి , ఏ ఒక్క విద్యార్ధి  నష్ట పోకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఎవాల్యూయేటర్స్  అవలంబించవలసిన పద్దతులపై మంచి శిక్షణ కల్పించి , సెన్సిటైజ్ చేయాలని సి.యస్ కోరారు. విద్యార్ధుల సౌకర్యార్ధం ఆన్ లైన్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభిస్తామని తెలుపుతూ జిల్లాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. అడ్మిషన్ నుండి తుది ఫలితాల వెల్లడి వరకు రెగ్యులర్ క్యాలెండర్ ను రూపొందించాలన్నారు. సి.జి.జి. రూపొందించిన వివిధ ఐ.టి.మాడ్యూళ్లను టెస్ట్ చేసి తపులు దోర్ల కుండా చూడాలన్నారు.

ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుండి మార్చి 23 వరకు , పదవ తరగతి పరీక్షలు మార్చి 19 నుండి ఏప్రిల్ 6 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సారి ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల విద్యార్ధులు , పదవ తరగతి పరీక్షలకు 5.08 లక్షల విద్యార్ధులు హజరవుతున్నారని, సెంటర్ల ఏర్పాటు , జంబ్లింగ్ పద్దతి, హల్ టికెట్ ల జారీ , ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియలను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి,ఐ.ఎ.ఎస్, ఇంటర్ మీడియట్ విద్య కమీషనర్  సయ్యద్ ఓమర్ జలీల్ , ఐ.ఎ.ఎస్, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ విజయ్ కుమార్ , ఐ.ఎ.ఎస్, సి.జి.జి. డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, ఐ.ఎ.ఎస్.,(రిటైర్డ్), టి.ఎస్. టెక్నలాజికల్ మేనెజింగ్ డైరెక్టర్ జి.టి.వేంకటేశ్వర్ రావు,ఐ.ఆర్.ఎస్., ఎస్.ఎస్.సి బోర్డ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితర అధికారులు  పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: